బెంగుళూరు: అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వీలుగా కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన మంత్రులు రాజీనామాలు చేశారు. త్వరలోనే కొత్త కేబినెట్ కొలువు తీరుతుందని సీఎం కుమారస్వామి ప్రకటించారు.

కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. అసంతృప్తులను  సంతృప్తి పర్చేందుకు  మంత్రి పదవులను ఇవ్వాలని  నిర్ణయం తీసుకొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది మంత్రులు, 10 మంది జేడీ(ఎస్) మంత్రులు రాజీనామాలు చేశారు.  రాజీనామాలు చేసిన మంత్రులు తమ రాజీనామాలను సీఎం కుమారస్వామికి అందించారు.

జేడీ(ఎస్)కు చెందిన 35 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలిస్తున్నారు. మూడు రోజుల పాటు రిసార్ట్‌ను బుక్ చేశారు.  మూడు రోజుల తర్వాత రిసార్ట్స్ నుండి ఎమ్మెల్యేలు నేరుగా అసెంబ్లీకి చేరుకొంటారు.

కూర్గ్‌లోని రిసార్ట్‌లో జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు ఉంటారు. గతంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీవి దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కూడ ఇదే రిసార్ట్‌లో  ఉన్నారు.
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. అసంతృప్తులందరికి కూడ కేబినెట్ పదవులు దక్కే అవకాశం ఉంది.