Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోడీ నుంచి ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనం పొందలేదు - గౌతమ్ అదానీ

ప్రధాని నరేంద్ర మోడీ నుంచి తాను ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనం పొందలేదని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. తన వ్యాపార ప్రస్థానం మూడు దశాబ్దాల కిందటే ప్రారంభమైందని, ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారని చెప్పారు. 

Never received personal benefit from PM Modi - Gautam Adani
Author
First Published Jan 8, 2023, 2:15 PM IST

ప్రధాని మోడీతో ఉన్న సంబంధాల వల్ల లబ్ది పొందుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అదానీ గ్రూప్స్ చైర్మర్ గౌతమ్ అదానీ స్పందించారు. తాను ఎప్పుడూ కూడా ప్రధాని నుంచి వ్యక్తిగత ప్రయోజనం పొందలేదని అన్నారు. తాను బీజేపీయేతర రాష్ట్రాల్లో కూడా వ్యాపారం చేస్తున్నాని చెప్పారు. కాబట్టి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు చెల్లవని అన్నారు. ఆయన ‘ఇండియా టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

“మోడీ నుంచి మీరు ఎప్పటికీ వ్యక్తిగత సహాయం పొందలేరని నేను చెప్పాలని అనుకుంటున్నాను. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విధానాల విషయంలో మీరు ఆయనతో మాట్లాడవచ్చు. కానీ ఒక పాలసీని రూపొందించినప్పుడు అది అదానీ గ్రూపుకు మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుంది.’’ అని ఆయన అన్నారు. 22 రాష్ట్రాల్లో అదానీ గ్రూప్ పనిచేస్తోందని, ఈ రాష్ట్రాలన్నీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలనలో లేవని అన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయుడు!.. టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులను ఉచితంగా ఫ్లైట్ ఎక్కించిన స్కూల్ ప్రిన్సిపాల్

“మేము ప్రతి రాష్ట్రంలో గరిష్ట పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాము. అదానీ గ్రూప్ నేడు 22 రాష్ట్రాల్లో పని చేస్తోంది. ఇది నిజంగా సంతోషించే విషయం. ఈ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో లేదు. అయినా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. వామపక్షాల పాలనలో ఉన్న కేరళలో, మమతా దీదీ ఉన్న పశ్చిమ బెంగాల్‌లో, నవీన్‌ పట్నాయక్‌ ఒడిశాలో, జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో, కేసీఆర్‌ రాష్ట్రంలో కూడా మేం పనిచేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

ఇటీవల తన వ్యాపారం పెద్ద ముందడుగు వేసిందని అన్నారు. కానీ తన అదానీ గ్రూప్ ప్రయాణం మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైందని అన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్నారని గుర్తు చేశారు. తన వృత్తిపరమైన వృద్ధిని ఏ ఒక్క రాజకీయ నాయకుడితోనూ ముడిపెట్టలేమని ఆయన స్పష్టం చేశారు.

తమిళ‌నాడు బీజేపీలో అంత‌ర్గ‌త పోరు.. కూర్చిల‌తో కొట్టుకున్న నేత‌లు...

‘‘ ప్రధాని మోడీ, నేను ఒకే రాష్ట్రానికి చెందినవాళ్ళం. అందుకే అలాంటి నిరాధారమైన ఆరోపణలకు నన్ను సులభంగా టార్గెట్ గా చేసుకున్నారు. ఇలాంటి కథనాలు నాపై నెట్టడం దురదృష్టకరం’’ అని గౌతమ్ అదానీ అన్నారు. 

‘‘ మా గ్రూపు విజయాలపై వచ్చిన ఆరోపణలు పక్షపాతంతో చేసినవే. అసలు విషయం ఏంటంటే నా వృత్తిపరమైన విజయం ఏ ఒక్క నాయకుడి వల్ల రాలేదు. మూడు దశాబ్దాల సుదీర్ఘ కాలంలో అనేక మంది నాయకులు, ప్రభుత్వాలు ప్రారంభించిన విధానం, సంస్థాగత సంస్కరణల వల్ల వచ్చింది.” అని అదానీ అన్నారు.

రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తన కెరీర్ ఊపందుకున్నదని గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. ‘‘ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎగ్జిమ్ (ఎగుమతి-దిగుమతి) విధానాన్ని సరళీకరించారు. అప్పుడే ఇదంతా ప్రారంభమైందని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ రాజీవ్ గాంధీ లేనిదే పారిశ్రామికవేత్తగా నా ప్రయాణం ఎప్పుడూ ప్రారంభం అయ్యేది కాదు’’ అని ఆయన అన్నారు.

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. జైలు నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే.. ఎక్కడంటే ?

కాగా.. గత కొంత కాలంగా గౌతమ్ అదానీ గ్రూప్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అదానీకి లాభాలు చేకూర్చేలా ప్రధాని వ్యవహిరస్తున్నారని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది. అలాగే మరో పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీపై కూడా విమర్శలు చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం “క్రోనీ క్యాపిటలిస్ట్ స్నేహితుల” కోసమే పనిచేస్తుందని, ఇది “అంబానీ-అదానీ సర్కార్” అని ఆరోపించింది.

Follow Us:
Download App:
  • android
  • ios