సారాంశం

ఒడిశా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఒడిశా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం న్యూయార్క్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రైలు ప్రమాదం నాకు గుర్తుంది. బ్రిటీష్ వాళ్ల తప్పిదం వల్లే రైలు కూలిపోయిందని కాంగ్రెస్ లేచి చెప్పలేదు. ఇది నా బాధ్యత మరియు నేను రాజీనామా చేస్తున్నాను అని కాంగ్రెస్ మంత్రి అన్నారు’’ అని అన్నారు. ప్రధాని మోదీ వెనక అద్దం చూస్తూ కారు భారతదేశం అనే కారు నడుపుతున్నారని విమర్శించారు. 

‘‘మీరు వారిని (బీజేపీని) ఏదైనా అడగండి.. వారు వెనక్కి తిరిగి చూసి నిందలు వేస్తారు. రైలు ప్రమాదం (ఒడిశాలో) ఎందుకు జరిగిందని వారిని అడగండి. 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఇలా చేసిందని వారు (బీజేపీ) చెబుతారు’’ అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.  వారు కేవలం గతాన్ని నిందించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

 


అయితే రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తుచేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన మొదటి కొన్ని రోజుల్లోనే దాదాపు 3,000 మంది మరణించారు. నిరంతర వైద్య పరిస్థితులను కలిగి ఉన్నప్పటికీ మృతుల సంఖ్య చివరకు చాలా ఎక్కువగా నమోదైంది. భోపాల్ గ్యాస్ లీక్ జరిగినప్పుడు మీ నాన్న రాజీనామా చేశారా? రైల్వేలో ఎంత అవినీతి జరుగుతోందో తెలుసా?’’ అని రాహుల్ గాంధీని ఓ నెటిజన్ ప్రశ్నించారు.