భారత్ కు వ్యతిరేకంగా ఏదైనా ఎవరైనా మాట్లాడితే కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: భారత ఆర్ధిక వ్యవస్థ గురించి ప్రపంచ బ్యాంకు సహా ఇతర సంస్థలు ప్రశంసలు కురిపిస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఎందుకు విశ్వసించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో నెటిజన్లు కాంగ్రెస్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీబీసీ లేదా జాక్ డొర్సే ఇండియాకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తే కాంగ్రెస్ పార్టీ సంబరాలు జరుపుకుంటుందని అంకుర్ సింగ్ అనే నెటిజన్ మండి పడ్డారు.
మరో వైపు జాక్ ఎందుకు ఇంతకాలం మాట్లాడలేదని జితేన్ గజారియా ప్రశ్నించారు.రాహుల్ గాంధీ అమెరికా పర్యటించిన తర్వాతే ఇండియా కు వ్యతిరేకంగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మరో వైపు వీరిద్దరి సమావేశంలో ఏం జరిగిందని ఆయన అడిగారు.
మరోవైపు టైంపాస్ చేయడానికి రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్లలేదని సిన్హా అనే నెటిజన్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో రాహుల్ గాంధీ రహస్య సమావేశాలు ఇండియాకు వ్యతిరేకంగా ఉన్నాయనే నివేదికలున్నట్టుగా ఆయన ఆరోపించారు. అయితే ఇండియాలో నియంతృత్వం ఉందని జాక్ ఆరోపించడం ఆశ్చర్యం అనిపించదన్నారు.
ఇదిలా ఉంటే జాక్ డోర్సె చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడ స్పందించారు. ఈ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. డోర్సే ట్విట్టర్ సీఈఓగా ఉన్న కాలంలో ఇండియా చట్టాలను పదే పదే ఉల్లంఘించారన్నారు.
