సారాంశం
కొత్త పార్లమెంట్ భవనంపై ఆర్ జే డీ ట్వీట్ పై నెటిజన్లు మండిపడ్డారు. ఆర్‌జేడీ ట్వీట్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం విషయమై ట్విట్టర్ వేదికగా ఆర్‌జేడీ చేసిన పోస్టింగ్ పై నెటిజన్లు మండిపడ్డారు.కొత్త పార్లమెంట్ భవనం నమూనాను శవపేటికతో పోల్చడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌జేడీ భవిష్యత్తు శవ పేటిక అంటూ నెటిజన్లు పేర్కొన్నారు.
మొదటి ఫోటో మీ పార్టీ భవిష్యత్తు , రెండో ఫోటో భారత దేశ భవిష్యత్తు అంటూ సౌరభ్ మౌర్య అనే నెటిజన్ వ్యాఖ్యానించారు.
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం అద్బుతమని మృణాల్ మొహంతి అనే నెటిజన్ వ్యాఖ్యానించారు. ఆధునిక డిజైన్ ప్రజాస్వామ్యం కోసం ప్రగతిశీ థృక్పథాన్ని ఈ నిర్మాణం ప్రతిబింబిస్తుందన్నారు.
ప్రతిపక్షాల శవపేటిక అంటూ పీఎస్ జైస్వాల్ ఆర్ జేడీ ట్వీట్ పై వ్యాఖ్యానించారు. ఆర్ జేడీ ట్వీట్ పై అఖిలేష్ కాంత్ ఝా మండిపడ్డారు. లాలూజీ భవిష్యత్తు అంటూ ఆయన పేర్కొన్నారు.