కుల సమస్యపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు: 2009లో అలా.. ఇప్పుడిలా..
దేశంలో ప్రజల కులం గురించి తాను అడగబోనని 2009లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వెనక్కకు తగ్గారని నెటిజన్లు మండిపడుతున్నారు.
న్యూఢిల్లీ:గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్దిపై పోరాటం చేయలేక కుల రాజకీయాల రాజకీయాలకు శ్రీకారం చుట్టారని ఆరోపణలు చేస్తున్నారు.200లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తాను ప్రజల కులం గురించి అడగబోనని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చేశారు.
కానీ ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. దీంతో అయితే దేశంలోని ప్రతి ఒక్కరి కులం గురించి తెలుసుకోవాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని నెటిజన్ అంకుర్ సింగ్ ప్రస్తావించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధిపై మోడీపై పోరాటం చేయలేక రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు శ్రీకారం చుట్టారని ఆయన వ్యాఖ్యానించారు.