Asianet News TeluguAsianet News Telugu

నేపాల్‌లో భారత కరెన్సీ నిషేధం...

భారత కరెన్సీపై నిషేధం విధిస్తూ నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నేపాల్ లో ఆర్థిక లావాదేవీల్లో భాగంగా భారతీయ కరెన్సీకి కూడా అనుమతి ఉండేది. కానీ తాజా నిర్ణయంతో ఆ  వెసులుబాటు లేకుండా పోయింది. అయితే మొత్తం కరెన్సీ నోట్లను కాకుండా కేవలం వంద రూపాయలకు పైబడిని కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. 
 
Nepal bans Indian currency notes above Rs 100
Author
Hyderabad, First Published Dec 14, 2018, 8:01 PM IST

భారత కరెన్సీపై నిషేధం విధిస్తూ నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నేపాల్ లో ఆర్థిక లావాదేవీల్లో భాగంగా భారతీయ కరెన్సీకి కూడా అనుమతి ఉండేది. కానీ తాజా నిర్ణయంతో ఆ  వెసులుబాటు లేకుండా పోయింది. అయితే మొత్తం కరెన్సీ నోట్లను కాకుండా కేవలం వంద రూపాయలకు పైబడిని కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. 

రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన భారతీయ నోట్లను చట్టబద్దంగా రద్దు చేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రజలందరూ తమ ఆదేశాలను అనుసరించి కేవలం రూ.100 కంటే తక్కువ విలువ గల నోట్లను మాత్రమే వాడాలని సూచించారు. ఇప్పటికే రూ.100 కంటే ఎక్కువ విలువ గల రూ.200,రూ.500, రూ.2000 నోట్లు ఉన్నవారు బ్యాంకుల ద్వారా మాత్రమే వాటిని మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది.

నేపాల్ తాజా నిర్ణయం భారత పర్యాటకులకు ఇబ్బంది కల్గించనుంది. అలాగే నేపాల్ తో వ్యాపార లావాదేవీలు జరిపే పలు ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులపై ఈ కరెన్సీ రద్దు ప్రభావం పడనుంది.  
   
Follow Us:
Download App:
  • android
  • ios