Asianet News TeluguAsianet News Telugu

16 భారత ఫార్మా కంపెనీల నుంచి ఔషధాల దిగుమతిపై నేపాల్ నిషేధం

Indian Pharma Companies:  ఔష‌ధాల త‌యారీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తప్పనిసరి పాటించాల్సిన విధానాల అమ‌లులో ఈ కంపెనీలు విఫలమయ్యాయని పేర్కొంటూ పతంజలి ఉత్పత్తులను తయారు చేసే దివ్య ఫార్మసీతో సహా 16 భారతీయ ఫార్మా కంపెనీల దిగుమతులను నేపాల్ నిషేధించింది.

Nepal bans import of medicines from 16 Indian pharma companies
Author
First Published Dec 21, 2022, 7:08 PM IST

Indian Pharma Companies: ఔష‌ధాల త‌యారీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తప్పనిసరి పాటించాల్సిన విధానాల అమ‌లులో ఈ కంపెనీలు విఫలమయ్యాయని పేర్కొంటూ పతంజలి ఉత్పత్తులను తయారు చేసే దివ్య ఫార్మసీతో సహా 16 భారతీయ ఫార్మా కంపెనీల దిగుమతులను నేపాల్ నిషేధించింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలో పిల్లల మరణాలకు సంబంధించిన భారతదేశంలో తయారుచేసిన దగ్గు సిరప్ ల‌తో సంబంధం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంత‌కు ముందు ప్ర‌పంచవ్యాప్తంగా హెచ్చరిక జారీ చేసింది. ఈ క్రమంలోనే భార‌త్ లో త‌యారైన ఈ ద‌గ్గు సిర‌ప్‌లపై ప‌లు దేశాలు ఇప్ప‌టికే నిషేధం విధించాయి. ఈ ఘ‌ట‌న త‌ర్వాత దేశంలో త‌యార‌వుతున్న ఔష‌ధాల త‌యారీపై ప్ర‌పంచ దేశాలు దిగుమ‌తి ప‌రీక్ష‌ల‌ను క‌ఠినత‌రం చేశాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఔష‌ధాల త‌యారీ ప్ర‌మాణాల విష‌యంలో విఫ‌ల‌మ‌య్యాయ‌ని ప‌లు భార‌త ఫార్మా కంపెనీలు త‌యారు చేసే ఔష‌ధాల దిగుమ‌తుల‌పై నేపాల్ నిషేధం విధించింది. 

నేపాల్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (DDA) అటువంటి 16 కంపెనీల జాబితాను ప్రచురించింది. వీటిలో రేడియంట్ పేరెంటరల్స్ లిమిటెడ్, మెర్క్యురీ లాబొరేటరీస్ లిమిటెడ్, అలయన్స్ బయోటెక్, క్యాప్టాబ్ బయోటెక్, అగ్లోమ్డ్ లిమిటెడ్, జీ లేబొరేటరీస్ లిమిటెడ్, డాఫోడిల్స్ ఫార్మాస్యూటికల్స్, లిమిటెడ్ , యునిజుల్స్ లైఫ్ సైన్స్ లిమిటెడ్, కాన్సెప్ట్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్., శ్రీ ఆనంద్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, ఐపీసీఏ లాబొరేటరీస్ లిమిటెడ్, కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్, డయల్ ఫార్మాస్యూటికల్స్, అగ్లోమ్డ్ లిమిటెడ్, మాకూర్ లాబొరేటరీస్ లిమిటెడ్ పేర్లు ఉన్నాయి. 

 మన దేశానికి తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి దరఖాస్తు చేసుకున్న ఫార్మాస్యూటికల్ కంపెనీల తయారీ సౌకర్యాలను తనిఖీ చేసిన తరువాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మంచి తయారీ పద్ధతులను పాటించని కంపెనీల జాబితాను మేము ప్రచురించాము అని డీడీఏ అధికార ప్రతినిధి సంతోష్ కేసీ తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ  ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్న 46 ఔషధ తయారీ కంపెనీల జాబితాను కూడా నేపాల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసింది. నేపాల్కు తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి అనుమతి కోరిన ఫార్మా కంపెనీలను తనిఖీ చేయడానికి డీడీఏ ఈ ఏడాది ఏప్రిల్, జూలైలో తన డ్రగ్ ఇన్స్పెక్టర్లను భారతదేశానికి పంపిందని తెలిపారు.

గాంబియాలో గుర్తించిన నాలుగు కలుషితమైన మందులకు డబ్ల్యూహెచ్ వో అక్టోబర్లో వైద్య ఉత్పత్తి హెచ్చరిక జారీ చేసింది. ఇవి తీవ్రమైన మూత్రపిండాల గాయాలు, పిల్లలలో 70 మరణాలతో ముడిపడి ఉన్నాయి. జూలై చివరిలో ఐదేళ్లలోపు పిల్లలలో తీవ్రమైన మూత్రపిండాల గాయం కేసులు పెరిగాయి. కేసులు పెరుగుతున్న కొద్దీ, మందుల ప్రమేయం ఉందని వైద్యులు అనుమానించడం ప్రారంభించారని రాయిటర్స్ నివేదించింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ వో) ప్రకారం, ఈ నాలుగు మందులు భారతదేశంలో మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే దగ్గు, జ‌లుబు సిరప్ లు. అప్రమత్తమైన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. గాంబియా పిల్లల మరణాలతో దగ్గు సిరప్ సంబంధం ఉన్న మైడెన్ ఫార్మా తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసినప్పుడు హర్యానా రాష్ట్ర డ్రగ్ అధికారులు స్పష్టమైన లోపాలను కనుగొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios