Asianet News TeluguAsianet News Telugu

NEET Results: నీట్‌ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థి .!

NEET UG 2023: నీట్-యూజీ 2023 పరీక్షలో ఇద్దరు విద్యార్థులు తొలి ర్యాంక్ సాధించారు. తమిళనాడుకు చెందిన ప్రబంజన్ జే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బొరా వరుణ్ చక్రవర్తి 99.99 పర్సంటైల్ స్కోర్‌తో ఫస్ట్ ర్యాంక్ సాధించారు.

NEET UG results out, get link to check scorecard KRJ
Author
First Published Jun 14, 2023, 5:48 AM IST

NEET UG 2023: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2023 ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలలో పరీక్షలో ఇద్దరు విద్యార్థులు తొలి ర్యాంక్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోరా వరుణ్ చక్రవర్తి అనే విద్యార్థి సత్తా చాటాడు. ఆలిండియా స్తాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మరోవైపు తమిళనాడుకి చెందిన ప్రభంజన్ 99.99 పర్సంటైల్ సాధించి తొలి ర్యాంక్ పొందినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వెల్లడించింది. 

అలాగే.. తెలంగాణకు చెందిన కాంచనీ గేయంత్  రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించగా, జాగృతి బొడెద్దులుకు 49వ ర్యాంక్ లభించింది. ఈ  సారి నీట్‌లో ఏపీ విద్యార్థులు 42,836 మంది, తెలంగాణలో 42,654 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు ఎన్టీఏ ప్రకటించింది. అలాగే.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు నీట్ కు అర్హత సాధించారని తెలిపింది. ఈ ఏడాది నీట్ కు దేశవ్యాప్తంగా మొత్తం 11,45,976 మంది విద్యార్థులుఅర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836 మంది.. తెలంగాణ నుంచి 42,654 మంది అభ్యర్థులు ఉన్నారు.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ UG (NEET UG) 2023 ఈసారి భారతదేశంలోని 14 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 499 నగరాల్లో ఉన్న 4097 వేర్వేరు కేంద్రాలలో నిర్వహించబడింది. మే 07న జరిగిన నీట్ యూజీ పరీక్షకు 97.7 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

నీట్ యూజీ ఫలితాల విడుదలలో జాప్యం ఎందుకు?

మణిపూర్‌లో హింస, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని జూన్ 06న నీట్ యూజీ పరీక్షను నిర్వహించారు. NTA అభ్యర్థులకు 10 నగరాల నుండి పరీక్షకు అవకాశం కల్పించింది. దాదాపు 8,700 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ఆలస్యం కావడంతో మణిపూర్ అభ్యర్థులకు నీట్ యూజీ ఫలితాల విడుదలలో స్వల్ప జాప్యం జరిగింది.

NEET UG 2023: NEET UG ఫలితాలను ఎలా తనిఖీ చేసుకోవాలి.
 
>> ముందుగా neet.nta.nic.inలో NTA NEET యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

>> హోమ్‌పేజీలో, 'NEET UG 2023 ఫలితం' లింక్ చేయబడుతుంది, దానిపై క్లిక్ చేయండి.

>> ఇప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ వంటి మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.

>> మీ NEET UG స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, దాన్ని తనిఖీ చేయండి.

>> NEET UG ఫలితాల స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి, ప్రింటవుట్ తీసుకొని మీ వద్ద ఉంచుకోండి.

 

Follow Us:
Download App:
  • android
  • ios