నీట్ ఫలితాలను విడుదల చేసిన సీబిఎస్ఈ : తెలంగాణ విద్యార్థికి రెండో ర్యాంకు

neet results released
Highlights

మొదటి ర్యాంకు సాధించిన బీహార్ యువతి కల్పనా కుమారి

దేశవ్యాప్తంగా మే 6 న జరిగిన నీట్-2018 (నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలను ఇవాళ సిబీఎస్ఈ విడుదల చేసింది. మెడికల్ మరియు డెంటల్ కోర్సుల కోసం దేశవ్యాప్తంగా ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో బీహార్ కు చెందిన విద్యార్థిని మొదటి ర్యాంకు సాధించగా, తెలంగాణ విద్యార్థి రెండో ర్యాంకును కైవసం చేసుకున్నాడు.  

నీట్‌- 2018 ఎగ్జామ్ ను 13 లక్షల మంది విద్యార్థులు రాయగా 7 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బీహార్ కు చెందిన కల్పనా కుమారి 99.99 శాతం మార్కులతో మొదటి ర్యాంకు సాధించింది. ఈమెకు 720 మార్కులకు గాను 691 మార్కులు వచ్చాయి.

ఇక ఈ ఫలితాల్లో రెండో ర్యాంకును మన తెలంగాణ విద్యార్థి రోహన్ పురోహిత్  సాధించాడు. ఆ తర్వాత ఢిల్లీకి చెందిన హిమాన్షు శర్మకు మూడవ ర్యాంక్ వచ్చింది.  ఈ ర్యాంకుల్లో టాప్ టెన్ లో ఇద్దరు మాత్రమే అమ్మాయిలు ఉన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 60వేల మెడికల్, డెంటల్ సీట్లను ఈ ఫలితాల ఆధారంగా భర్తీ చేస్తారు. ఈ ఫలితాల కోసం cbseneet.nic.in, cbseresults.nic.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చు.  
 

loader