Kohima: నాగాలాండ్ లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నీఫియు రియో తన పార్టీ, దాని మిత్రపక్షమైన బీజేపీకి మరోసారి అధికారంలోకి తీసుకువచ్చారు. ఐదోసారి అధికారం చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీలో బీజేపీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) లు 33 సీట్లు సాధించాయి.
Nagaland CM Neiphiu Rio: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఐదోసారి రాజకీయ దిగ్గజం నీఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోహిమా నగరంలో జరిగింది. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు.. జి కైటో అయే, జాకబ్ జిమోమి, కెజి కెన్యే, పి పైవాంగ్ కొన్యాక్, మెట్సుబో జమీర్, టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్, సిఎల్ జాన్, సల్హౌటుయోనువో క్రూస్, పీ బషాంగ్‌మోంగ్బా లు నాగాలాండ్ క్యాబినెట్‌లో మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు.
ఇటీవల ముగిసిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ), దాని మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మొత్తం 37 స్థానాలను (ఎన్డీపీపీ 25, బీజేపీ 12) గెలుచుకున్నాయి. 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) కూడా రెండు స్థానాల్లో విజయం సాధించి ఖాతా తెరవగలిగింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ కూడా రెండు స్థానాలను గెలుచుకోగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఉత్తర రాష్ట్రంలో 7 స్థానాలను గెలుచుకోగలిగింది. జనతాదళ్ (యునైటెడ్) ఒక స్థానాన్ని గెలుచుకుంది. రియో నేతృత్వంలోని కూటమికి అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో రాష్ట్రంలో ప్రతిపక్షం లేని అఖిలపక్ష ప్రభుత్వానికి రియో నేతృత్వం వహించనున్నారు.
ఎవరీ నీఫియు రియో..? ఆయన రాజకీయ ప్రయాణం..
నీఫియు రియో 1950 నవంబర్ 11న నాగాలాండ్ రాజధాని కోహిమాలో జన్మించారు. హైస్కూల్, కళాశాలలో చురుకైన విద్యార్థి నాయకుడిగా ఉన్న నీఫియు రియో చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1974లో కోహిమా జిల్లాలో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ యువజన విభాగానికి అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1987లో తాను పోటీ చేసిన ఎన్నికల్లో రియో ఒక్కదాంట్లో మాత్రమే ఓడిపోయారు. ఆ సమయంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రెండేళ్ల తర్వాత అంటే 1989లో కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తొలి తాత్కాలిక విజయం తరువాత, ఆయన రాజకీయ ప్రయాణం ఎదురులేకుండా ముందుకు సాగింది. ఆయన దేశానికి అనేక హోదాలలో సేవలందించాడు, ముఖ్యంగా 2002 వరకు జమీర్ మంత్రివర్గంలో హోం మంత్రిగా పనిచేశాడు.
అయితే, 2022లో ఆయన కాంగ్రెస్ ను వీడిచిపెట్టారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ ను పునరుద్ధరించడంలో కీలకంగా వ్యవహరించారు. రియో 2003లో తొలిసారి నాగాలాండ్ సీఎం అయ్యారు. రియో 2003లో జమీర్ ను గద్దె దింపి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2008 జనవరిలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు. రెండు నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్ పీఎఫ్ నేతృత్వంలోని డెమోక్రటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ నేతగా రియోను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 2013 రాష్ట్ర ఎన్నికలలో, ఎన్పిఎఫ్ అఖండ విజయం సాధించింది. రియో మూడవసారి ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యాడు.
2014 వరకు ఆ పదవిలో కొనసాగిన ఆయన రాజీనామా చేసి జాతీయ పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 2018 ఫిబ్రవరి 9న లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ అంతర్గత కుమ్ములాటల మధ్య రియో ఎన్డీడీపీలో చేరారు. 2018 రాష్ట్ర ఎన్నికల్లో కాషాయ పార్టీతో ముందస్తు ఒప్పందంపై పోటీ చేశారు.
