ఒడిశాలో 9వ తరగతి పరీక్షలకు దాదాపు 15 వేల మంది విద్యార్ధులు గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది. దీనిపై బోర్డు సీరియస్ అయ్యింది. పరీక్షకు ఎవరైతే హాజరయ్యారో వారినే పై తరగతులకు ప్రమోట్ చేస్తామని వెల్లడించింది.
సమ్మేటివ్ అసెస్‌మెంట్ 2 పరీక్షఖు భారీ సంఖ్యలో 10వ తరగతి విద్యార్ధులు గైర్హాజరు కావడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా 9వ తరగతి విద్యార్ధులు భారీగా పరీక్షలకు గైర్హాజరవ్వడం ఒడిశాలో చర్చనీయాంశమవుతోంది. 9వ తరగతి పరీక్షకు 14,935 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. వీటి ఫలితాలను ఈ రోజు బోర్డ్ ఆప్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. 9వ తరగతతి పరీక్షలకు మొత్తం 5,66,269 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా.. వారిలో 5,51,334 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే 14,935 మంది గైర్హాజరయ్యారు. అదే విధంగా మాధ్యమ పరీక్షకు 3,399 మంది విద్యార్ధులు నమోదు చేసుకుంటే.. 3,270 మంది హాజరవ్వగా.. 129 మంది గైర్హాజరయ్యారు.
9వ తరగతి పరీక్షకు హాజరైన అభ్యర్ధులందరూ పదో తరగతికి ప్రమోట్ అవుతారని బోర్డు వెల్లడించింది. అయిలే గ్రేడ్ ఎఫ్ (II)లో 30,138 మంది అభ్యర్ధులు సంబంధిత పాఠశాలలు నిర్వహించే ఇంప్రూవ్‌మెంట్ టెస్టులలో తమ పనితీరును మెరుగుపరచుకోవాలని బోర్డ్ పేర్కొంది. అయితే గ్రేడ్ ఎఫ్ (I) వున్న అభ్యర్ధులు మొత్తం వ్యక్తిగత సబ్జెక్ట్ మార్కులకు సంబంధించిన కొన్ని కనీస ప్రమాణాలను పూర్తి చేసినందున వారు పరిశీలనలో ఉత్తీర్ణులయ్యారని ప్రకటించింది. ఎఫ్ (II) అభ్యర్ధులకు ప్రతి ఫయిల్ అయిన సబ్జెక్ట్‌లో అర్హత మార్కులు (30శాతం) పొందేందుకు మూడు అవకాశాలు ఇస్తామని తెలిపింది. పాఠశాలలు అభ్యర్ధులకు మే 31, 2022 వరకు పరిష్కార బోధనలు అందిస్తామని బోర్డు వెల్లడించింది. జూన్ 1, జూన్ 8 , జూన్ 16 తేదీల్లో ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
మొదటి ఇంప్రూవ్‌మెంట్ టెస్టులో అర్హత సాధించని అభ్యర్ధులు ఏడు రోజుల పాటు రెమిడియల్ టీచింగ్‌లు ఇచ్చిన తర్వాత రెండవ , మూడవ ఇంప్రూవ్‌మెంట్ టెస్టుల కోసం హాజరవుతారు. పాఠశాలలు 20 మార్కులకు ప్రశ్నలను ప్రిపేర్ చేస్తాయని.. ఈ పరీక్ష 40 నిమిషాల పాటు జరుగుతుందని బోర్డు తెలిపింది. గైర్హాజరైన అభ్యర్ధులకు సంబంధించి .. అన్ని జిల్లా విద్యాధికారులు సమగ్ర నివేదికను సమర్పించాలని బోర్డు పేర్కొంది. ఇందుకు సంబంధించిన డేటాను పాఠశాలలకు పంపుతామని తెలిపింది. సంబంధించి స్కూల్ హెడ్ మాస్టర్‌లచే నమదు చేయబడినప్పటికీ వారు ఎందుకు పరీక్షకు హాజరుకాలేకపోయారనే దానిపై మే 31 లేదా దానికి ముందే బోర్డుకు నివేదిక పంపబడుతుంది.
