Asianet News TeluguAsianet News Telugu

పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌పై చర్యలు తీసుకోండి: కర్ణాటక డీజీపీకి ఎన్‌సీ‌పీఆర్ ఛైర్మెన్ లేఖ


కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర డీజీపీకి ఎన్‌సీ‌పీఆర్ ఛైర్మెన్ ప్రియాంక్ కనూగో   లేఖ రాశారు. కరోనా ప్రోటోకాల్స్ పాటించకుండా పిల్లలతో సమావేశం కావడాన్ని తప్పుబట్టారు.ఈ విషయమై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

NCPR Chairperson Priyank Kanoongo  writes letter to Karnataka DGP Praveen Sood
Author
Bangalore, First Published Jan 10, 2022, 9:51 PM IST

బెంగుళూరు:  మేకేదాటు పాదయాత్ర సందర్భంగా స్కూల్ పిల్లలతో  కరోనా ప్రోటోకాల్ ను పాటించడంలో వైఫల్యం చెందిన కర్ణాటక పీసీసీ చీఫ్, మాజీ మంత్రి డికె శివకుమార్ పై చర్యలు తీసుకోవాలని ఎన్‌సీ‌పీఆర్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూగో    కర్ణాటక డీజీపీ Praveen sood కు లేఖ  రాశారు.

2005  బాలల హక్కుల చట్టం ప్రకారంగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సెక్షన్ కింద ఏర్పాటు చేయబడిన సంస్థగా ప్రియాంక కనూగో గుర్తు చేశారు.   లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణతో పాటు ,2015  జువెనైల్ చట్టం, ఉచిత నిర్భంద హక్కు చట్టం సమర్ధవంతంగా అమలు చేయడాన్ని కమిషన్ పర్యవేక్షించనుందని Priyank kanoongo  ఆ లేఖలో ప్రస్తావించారు.

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు Dk Shiva kumaar మేకేదాటు పాదయాత్ర సందర్భంగా స్కూల్ విద్యార్ధులతో సమావేశమైన సందర్భంలో corona ప్రోటోకాల్స్ పాటించలేదని Enl  పేర్కొన్నారు. అంతేకాదు విద్యార్ధులను రాజకీయ కార్యకలాపాల్లోకి  విద్యార్ధులను భాగస్వామ్యం చేశారని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో ఆధారంగా తమ కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిందని డీజీపీకి ఆ లేఖలో ప్రియాంక్ కనూగో తెలిపారు. 

సీపీసీఆర్ 2005 చట్టంతో పాటు జువైనెల్ జస్టిస్ చట్టం కింద ప్రాథమిక నిబంధనలను పీసీసీ చీఫ్ శివకమార్ ఉల్లంఘించారని ప్రియాంక్  అభిప్రాయపడ్డారు. అంతేకాదు 2015 ఎపిడమిక్ డీసీజ్ యాక్ట్ 1997 డిజాస్టర్ మేనేజ్ మెంట్ మేరకు శివకుమార్ పై చర్యలు తీసుకోవడం సముచితమని భావిస్తున్నట్టుగా ప్రియాంక్  కనూగో కోరారు.

తాము ఈ లేఖలో పేర్కొన్న ఆరోపణలను పరిశీలించాలని  డీజీపీని ప్రియాంక్ కనూగో కోరారు. ఈ లేఖ అందిన ఏడు రోజుల్లో తీసుకొన్న చర్యలపై నివేదికను ఇవ్వాలని డీజీపీని ప్రియాంక్ కనూగో కోరారు. 

కర్ణాటక రాష్ట్రంలో మేకేదాటు నీటి పథకాన్ని అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర సాగుతుంది. డికె శివకుమార్ సహా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి పూట కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది.ఈ తరుణంలో ఈ పాదయాత్ర రాష్ట్రంలో కరోనాను వ్యాప్తి చేసేందుకు దోహదం చేసే అవకాశం ఉందనే బీజేపీ ఆరోపిస్తోంది.  మరో వైపు పాదయాత్ర సందర్భంగా విశ్రాంతి తీసుకొంటున్న డీకే శివకుమార్ వద్దకు వెళ్లిన వైద్య సిబ్బందిని ఆయన వెనక్కి పంపారు. కరోనా పరీక్షలు చేయించుకొనేందుకు కూడా శివకుమార్ నిరాకరించారు.

10 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 19న పాదయాత్ర బెంగుళూరులో ముగియనుంది. ఈ నెల 9న కనకపురలో పాదయాత్ర ప్రారంభమైంది. మాజీ సీఎం సిద్దరామయ్య, రాజ్యసభలో విపక్షనేత  సిద్దరామయ్యలు ఈ ర్యాలీని ప్రారంభించారు. మరో వైపు కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేసినట్టుగా కర్ణాటక సీఎం బొమ్మై తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios