నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ భాల్కీ శనివారం కరోనా మృతి చెందారు. పరీక్షల్లో ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్ భాల్కీ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో అతనిని పూణే నగరంలోని రూబీ ఆసుపత్రికి చేర్చారు. పాంథర్ పూర్ మంగల్ వేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన భరత్ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచారు.

ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్ భాల్కే మృతి తమకు దిగ్భ్రాంతి కలిగించిందని, మంచి వక్త, అంకితభావంతో పనిచేసిన వ్యక్తి మరణించడం తమకు తీరని లోటని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే విచారం వ్యక్తం చేశారు. భరత్ మృతికి నివాళులు అర్పిస్తూ మంత్రి రాజేష్ ట్వీట్ చేశారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.