Asianet News TeluguAsianet News Telugu

26మందిని చంపిన మహిళా మావోయిస్టు అరెస్ట్

సుమిత్ర అక్క అలియాస్ సుమిత్ర పూనం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా వాసి. 2013 వ సంవత్సరంలో మే 25వతేదీన సుక్మాజిల్లా దర్బా లోయలో కాంగ్రెస్ నాయకులపై మావోయిస్టులు దాడి చేసి 26 మందిని హతమార్చారు.

Naxal involved in attack on Congress convoy in 2013 arrested
Author
Hyderabad, First Published Nov 30, 2019, 10:54 AM IST

26మంది కాంగ్రెస్ నాయకులనుచంపిన కరుడు గట్టిన మహిళా మావోయిస్టు ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ సంఘటన ఛత్తీస్ ఘఢ్ లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌ఘడ్ దర్బా లోయలో దాడి చేసి 26 మంది కాంగ్రెస్ నాయకులను చంపిన కేసులో నిందితురాలైన కరడుకట్టిన మహిళా మావోయిస్టు సుమిత్రా పూనంను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు.

 సుమిత్ర అక్క అలియాస్ సుమిత్ర పూనం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా వాసి. 2013 వ సంవత్సరంలో మే 25వతేదీన సుక్మాజిల్లా దర్బా లోయలో కాంగ్రెస్ నాయకులపై మావోయిస్టులు దాడి చేసి 26 మందిని హతమార్చారు. కాంగ్రెస్ నాయకులపై దాడి చేసిన పుష్పల్ దళంలో సుమిత్ర పూనం సభ్యురాలు. 

మావోయిస్టుల దాడిలో కాంగ్రెస్ నాయకులు మహేంద్రకర్మ, నందకుమార్ పటేల్, మాజీ ఎమ్మెల్యే ఉదయకుమార్ ముదలియార్లతో పాటు 26 మంది మరణించారు. ఈ దాడిలో 39 మంది మావోయిస్టులు పాల్గొనగా వారిలో ఇప్పటికే పదిమందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు మావోయిస్టులు ఎన్‌కౌంటరులో మరణించారు.27 మంది మావోయిస్టులు పరారీలో ఉండగా, తాజాగా సుమిత్రా పూనం ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios