Agnipath Scheme Protests: కేంద్ర ప్ర‌భుత్వం నూత‌నంగా ప్ర‌వేశపెట్టిన‌ 'అగ్నిపథ్‌' (Agnipath) పథకంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక నిరసనలు (Violent Protests) చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాన్ని తాము ఊహించలేదని నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరి కుమార్ (Admiral R Hari Kumar) అన్నారు. ఈ పథ‌కం ద్వారా దేశానికి, యువతకు ప్రయోజనం చేకూరుతాయ‌ని అన్నారు.  

Agnipath Scheme Protests: కేంద్ర ప్ర‌భుత్వం నూత‌నంగా ప్ర‌వేశపెట్టిన‌ 'అగ్నిపథ్‌' (Agnipath) పథకంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక నిరసనలు (Violent Protests) చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాన్ని తాము ఊహించలేదని నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరి కుమార్ (Admiral R Hari Kumar) అన్నారు. 

అగ్నివీర్ రిక్రూట్ మెంట్ స్కీమ్ (Agniveer Recruitment Scheme) అనేది భారతదేశ మిలటరీలో ఏకైక అతిపెద్ద హ్యూహన్ రిసోర్సెస్ మేనేజిమెంట్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ అని, సరైన సమాచార లోపం, అవగాహనా రాహిత్యం కారణంగానే నిరసనలు తలెత్తాయని నావికాదళాధిపతి అన్నారు. ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకంతో కలత చెందుతున్న వారికి మీ సందేశమేమిట‌ని ప్ర‌శ్నించ‌గా.. తప్పుడు సమాచారం కార‌ణంగా.. ఇటువంటి నిర‌స‌నలు వ్య‌క్త‌మతున్నాయ‌ని అన్నారు. 

భారతదేశ చరిత్రలో చేపట్టిన అత్యంత పరివర్తనాత్మక పథకాలలో ఇది ఒకటనీ, సైన్యం రూపాంతరం చెందుతుందనీ, యువతలో జాతీయ తత్వాన్ని పెంపొందించడంతోపాటు సాయుధ బలగాల వయస్సు ప్రొఫైల్‌ను కలిగి ఉండే ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఆలోచిస్తోందని తెలిపారు.

ఈ పథకం దేశానికి, యువతకు ప్రయోజనకరంగా ఉందని అన్నారు. ఎందుకంటే.. ఇది మరిన్ని అవకాశాలను తెరుస్తుందని. త‌ప్పుడు సమాచారం, పథకాన్ని అపార్థం చేసుకోవ‌డం కారణంగా నిరసనలు జరుగుతున్నాయని అన్నారాయన. ఇంతకుముందు సాయుధ దళాలలో ఒక‌రూ ప‌ని చోట.. న‌లుగురికి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని అన్నారు.

తక్కువ వ్యవధి గురించి ప్రస్తావిస్తూ.. సాయుధ బలగాలను వృత్తిగా కొనసాగించాలా? లేదా మరొక ఉద్యోగంలో తీసుకోవాలా? అని అగ్నివీర్‌లు నిర్ణయించుకుంటారని అన్నారు. ఈ ప‌థ‌కంలో చాలా ప్రయోజనాలున్నాయని ఆయన అన్నారు.

Agnipath పథకాన్ని తాము ఏడాదిన్నర పాటు కష్టపడి రూపొందించామ‌ని అడ్మిరల్ ఆర్ హరి కుమార్ అన్నారు. భార‌త్ లో తయారైన, భార‌తీయుల‌ కోసం రూపొందించిన ప‌థ‌కమ‌ని అన్నారు. ఈ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌పై ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిరసనలు, హింసకు పాల్పడవద్దని తాను విజ్ఞప్తి చేస్తున్నానని, పథకాన్ని పూర్తిగా అర్ధం చేసుకుని ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నానని అన్నారు. దేశానికి సేవ చేయాల‌ని భావించే యువతకు ఇదో గొప్ప అవకాశమని అన్నారు.

ఇదిలాఉంటే.. దేశ‌వ్యాప్తంగా నిరస‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో జ‌రిగిన దాడుల్లో 19 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అనేక రాష్ట్రాల్లో కొత్త సైనిక నియామక విధానంపై ఆగ్రహించిన నిర‌స‌న‌కారులు రైళ్లకు నిప్పు పెట్టడం, పోలీసులతో ఘర్షణ పడడంతో పలువురు గాయపడ్డారు.

ఈ ప‌థ‌కానికి నిర‌స‌న‌గా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు జ‌రిగాయి. బీహార్‌లోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను దుర్వినియోగం చేయడం వల్ల ఈ 12 జిల్లాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.