Asianet News TeluguAsianet News Telugu

Punjab Assembly Election 2022: సిద్దూకు దిమాక్ లేదు.. :పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద్ సింగ్

Punjab Assembly Election 2022: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆదివారం ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై నిప్పులు చెరిగారు. సిద్దూకు  “దిమాక్” (no brains) లేద‌ని అన్నారు.  అలాంటి “ఈ అసమర్థ వ్యక్తిని” పార్టీలో చేర్చుకోవద్దని తాను ఐదేండ్ల కింద‌టే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి స‌ల‌హా ఇచ్చాన‌ని అన్నారు. 
 

Navjot Singh Sidhu has no brains: Punjab ex-CM Amarinder Singh
Author
Hyderabad, First Published Jan 24, 2022, 1:40 AM IST

Punjab Assembly Election 2022: ఎన్నిక‌ల నేప‌థ్యంలో పంజాబ్ రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి. ఇటీవ‌లే కాంగ్రెస్ (Congress)ను వీడి కొత్త పార్టీ పెట్టిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ (Punjab ex-CM Amarinder Singh) ఆదివారం నాడు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై నిప్పులు చెరిగారు. సిద్దూకు “దిమాక్” (no brains) లేద‌ని అన్నారు. అలాంటి “అసమర్థ వ్యక్తిని” పార్టీలో చేర్చుకోవద్దని తాను ఐదేండ్ల కింద‌టే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి స‌ల‌హా ఇచ్చాన‌ని అన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతో పాటు మరికొందరు కాంగ్రెస్‌ నేతల ప్రమేయం ఉన్నట్లు సమాచారం అందినప్పటికీ, పార్టీ పట్ల ఉన్న విధేయతతో వారిపై చర్యలు తీసుకోలేదని అమ‌రీంద‌ర్ సింగ్ అన్నారు. వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి కాంగ్రెస్ (Congress) అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) నుంచి అనుమ‌తించ‌లేద‌ని ఆరోపించారు. 

కాగా, ఇటీవ‌లే కాంగ్రెస్ (Congress) ను వీడిన అమ‌రీంద‌ర్ సింగ్‌.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ (PLC) పేరిట కొత్త రాజ‌కీయ పార్టీని స్థాపించారు. ప్ర‌స్తుతం జ‌ర‌గనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (Punjab Assembly Election 2022) 22 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పీఎల్‌సీ బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల తొలి జాబితాను అమ‌రీంద‌ర్ సింగ్ ఆదివారం నాడు విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్ కాంగ్రె్ చీఫ్‌, ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్ జిత్ సింగ్ ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్ర సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీకి వ్య‌తిరేకంగా ఒక మ‌హిళా ఐఏఎస్ అధికారి #మీటూ (#MeToo) కేసు ఫిర్యాదు చేసినా చ‌ర్య తీసుకోలేద‌ని పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌ల్లో సిద్దూను గెల‌వ‌నివ్వ‌బోమ‌నీ, ఎందుకంటే అత‌ను పూర్తిగా అస‌మ‌ర్థుడంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. "సిద్ధూ ఎలా ఉన్నాడో తనిఖీ చేయమని (ఐదేళ్ల క్రితం) కాంగ్రెస్ చీఫ్ నాతో చెప్పినప్పుడు, ఈ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పూర్తిగా అనర్హుడని నేను చెప్పాను. అయినప్పటికీ వారు ముందుకు సాగారు. అతనిని కాంగ్రెస్ లో  చేర్చుకున్నారు" అని అమ‌రీంద‌ర్ సింగ్ అన్నారు.

2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (Punjab Assembly Election)కు ముందు కాంగ్రెస్‌లో సిద్ధూ చేరారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో కొన‌సాగుతున్న విభేదాలతో, అమరీందర్ సింగ్ (Punjab ex-CM Amarinder Singh) గత సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయ‌డంతో పాటు కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త పార్టీ  పెట్టారు. "మొదటి రోజు నుండి, ఆ మనిషి (న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ) కి మెదడు లేదని నేను చెబుతున్నాను. అతను కేవలం సమయం వృధా చేసేవాడు. అతను మాకు (పార్టీకి) ఎలా సరిపోతాడని కాంగ్రెస్ అధ్యక్షురాలు (Sonia Gandhi) నన్ను అడిగినప్పుడు నేను ఇదంతా చెప్పాను" అని అమరీందర్ సింగ్ అన్నారు. అలాగే, తాను రెండో సారి పంజాబ్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగిన నాలుగున్నరేళ్ల పదవీకాలంలో, ఎన్నికల హామీలలో 92 శాతం నెరవేర్చినట్లు చెప్పారు. కాగా, ప్ర‌స్తుతం జ‌ర‌గ‌నున్న పంజాబ్ ఎన్నిక‌ల్లో (Punjab Assembly Election 2022) అమ‌రీంద‌ర్ సింగ్ కొత్త పార్టీ పీఎల్‌సీ (పంజాబ్ లోక్ కాంగ్రెస్).. బీజేపీ  (Bharatiya Janata Party) తో పాటు శిరోమ‌ణి అకాలీద‌ళ్ (సంయుక్త్) (SAD-Sanyukt) కూట‌మితో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలో దిగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios