ఛంఢీఘడ్: మంత్రి పదవికి నవజ్యోత్ సిద్దూ ఆదివారం నాడు రాజీనామా చేశారు.

ఛంఢీఘడ్: మంత్రి పదవికి నవజ్యోత్ సిద్దూ ఆదివారం నాడు రాజీనామా చేశారు.కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన రాజీనామా లేఖను సిద్దూ పంపారు.ఈ రాజీనామా లేఖను ఈ ఏడాది జూన్ 10వ తేదీనే సిద్దూ పంపారు.

Scroll to load tweet…

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో మంత్రి సిద్దూకు ఇటీవల కాలంలో విభేదాలు నెలకొన్నాయి. దీంతో సిద్దూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా ఆమోదం పొందాలంటే ఆ రాష్ట్ర గవర్నర్‌ లేదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజీనామా లేఖను పంపాలి.సిద్దూ మాత్రం తన రాజీనామా లేఖను రాహుల్ కు పంపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సిద్దూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.