Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేట్ రంగంలో అగ్నివీరులకు అపారమైన అవకాశాలు: ఏషియానెట్ ఇంటర్వ్యూలో నౌకరి. కామ్ సంజీవ్ బిఖ్‌చందానీ

అగ్నిపథ్‌ స్కీమ్‌లో చేరి నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే యువతకు ప్రైవేట్ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇన్ఫోఎడ్జ్ వ్యవస్థాపకులు సంజీవ్ బిఖ్‌చందానీ చెప్పారు. సైన్యంలో నాలుగేళ్లు ఉండటం వల్ల వారికి కమిట్‌మెంట్, ఫోకస్, డిసిప్లేన్ అలవాటు పడుతుందన్నారు.

naukri founder sanjeev bikhchandani about job opportunities to agniveer in asianet interview
Author
First Published Jun 26, 2022, 7:44 PM IST

త్రివిధ దళాల్లో నియమాకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి వ్యతిరేకంగా పలువురు ఆర్మీ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తుండగా, పలు ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే మరో వర్గం మాత్రం అగ్నిపథ్ స్కీమ్‌తో ఎటువంటి నష్టం జరగబోదని చెబుతోంది. నాలుగు సంవత్సరాలు సైన్యంలో సేవ చేయడం వల్ల యువత క్రమశిక్షణతో పాటు శిక్షణ పొందిన ప్రొఫెషనల్‌గా మారేందుకు దోహదపడుతుందని వారు చెబుతున్నారు. ఇలాంటి వాదనే వినిపిస్తున్నారు..  పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇన్ఫోఎడ్జ్ వ్యవస్థాపకులు సంజీవ్ బిఖ్‌చందానీ. Naukari.com, 99acres.com, Jeevansathi.com, Shiksha.com వంటి ఆన్‌లైన్ సేవలను అందించే పోర్టల్‌లు InfoEdge కింద ఉన్నాయి.

తాజాగా అగ్నిపథ్ స్కీమ్ గురించి  ఏషియానెట్‌ న్యూస్‌‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంజీవ్ బిఖ్‌చందానీ మాట్లాడారు. అగ్నిపథ్ ఇన్షియేటివ్ మంచిదా?, కాదా? అనే చెప్పగలిగినంత ఎక్స్‌పర్ట్ కాదని అన్నారు. అయితే తన అభిప్రాయం ప్రకారం.. అగ్నిపథ్ స్కీమ్‌లో చేరి నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, రాష్ట్రాల పోలీసు డిపార్ట్‌మెంట్స్‌లోనే కాకుండా ప్రైవేట్ సెక్టార్‌లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని చెప్పారు. 

ఆర్మీలో నాలుగేళ్ల పూర్తిచేసుకుని బయటకు వచ్చే  సమయంలో వారి వయసు 21 లేదా 22 లేదా 23 మాత్రమేనని చెప్పారు. వారికి కమిట్‌మెంట్, ఫోకస్, డిసిప్లేన్, టీమ్ వర్క్.. అలవాటు పడుతుందన్నారు .చిన్న వయస్సులోనే శిక్షణ ద్వారా నైపుణ్యాలను సంపాదించి ప్రైవేట్ రంగంలో తమ ఉపాధి అవకాశాలను మరింత మెరుగ్గా రాణించగలుగుతారని చెప్పారు. వీరికి సెక్యూరిటీ డిపార్టమెంట్స్‌ మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు. సాఫ్ట్‌వేర్ వంటి టెక్నికల్ రంగంలో కాకుండా.. సేల్స్, కస్టమర్ సర్వీసెస్, ఆపరేషన్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పారు. ప్రైవేట్ రంగంలోని చాలా కంపెనీలు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, యువత‌ను చేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయని సంజీవ్ చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios