Asianet News TeluguAsianet News Telugu

దేశవ్యాప్త లాక్ డౌన్ : ఐదుస్తంభాల వ్యూహం.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..


కరోనా వైరస్ రెండో దశలో తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ 19ను అడ్డుకునే చర్యల్లో ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ విధించబోదని స్పష్టం చేశారు.

nationwide lockdown : nirmala sitaraman key comments - bsb
Author
Hyderabad, First Published Apr 14, 2021, 1:53 PM IST

కరోనా వైరస్ రెండో దశలో తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ 19ను అడ్డుకునే చర్యల్లో ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ విధించబోదని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించమని, స్థానికంగానే నియంత్రణా చర్యల్ని చేపడతామని ఆమె వెల్లడించారు ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడం తమకు ఇష్టం లేదని ఆమె పేర్కొన్నారు.

కరోనా కట్టడికి ఆయా కంటైన్‌మెంట్ జోన్లలో కఠిన చర్యలపై మాత్రమే ఆధారపడతారన్నారు. ఆయా రాష్ట్రాల కోడ్ సమాచారాన్ని సేకరించామని, చర్యలు బాగున్నాయని ఆర్థిక మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రపంచ బ్యాంకుగ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్‌పాస్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలతో పాటు ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్ ప్రభావాల గురించి మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ లో కూడా భారీ లాక్ డౌన్ దిశగా తాము పోవడం లేదన్నారు.

టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, కరోనా నిబంధనలు లాంటి 5 స్తంభాల వ్యూహంతో కరోనాను కట్టడి చేస్తామన్నారు. వైరస్ బారిన పడిన వారికి హోం క్వారంటైన్ చేస్తామని ఆమె తెలిపారు.

అలాగే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు చేపడతామని, భారత దేశానికి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రపంచ బ్యాంకు చేపట్టిన చర్యలను ప్రశంసించారు.

కాగా దేశంలో రికార్డ్ కేసులతో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రెండు లక్షలకు చేరువలో ఉన్న కరోనా పాజిటివ్ కేసులు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని, రాష్ట్రాలే కఠిన నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఈ మేరకు రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios