Asianet News TeluguAsianet News Telugu

లోక్ సభ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: ఎన్డీఏకే పట్టం, విపక్షాల ఆశలు గల్లంతు

గతంతో పోల్చుకుంటే బీజేపీకి మరిన్ని సీట్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించాయి. మేజిక్ ఫిగర్ దాటి 15 స్థానాలను సైతం ఎన్డీఏ గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇకపోతే యూపీఏ 126 స్థానాల లోపే విజయం సాధిస్తోందని తెలిపాయి. ఇకపోతే ఇతరులు హవా మాత్రం జెట్ స్పీడ్ లో ఉంది. 

national loksabha elections bjp seems to be head magic figure
Author
Hyderabad, First Published May 19, 2019, 7:44 PM IST

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఆశలు గల్లంతు చేసేలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. గతంతో పోల్చుకుంటే బీజేపీకి మరిన్ని సీట్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించాయి. మేజిక్ ఫిగర్ దాటి 15 స్థానాలను సైతం ఎన్డీఏ గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. 

ఇకపోతే యూపీఏ 126 స్థానాల లోపే విజయం సాధిస్తోందని తెలిపాయి. ఇకపోతే ఇతరులు హవా మాత్రం జెట్ స్పీడ్ లో ఉంది. 130 పైగా స్థానాల్లో ఇతరులు గెలుస్తారని జాతీయ మీడియా చానెల్స్ స్పష్టం చేశాయి.  

దాదాపు అత్యధిక స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇకపోతే విపక్షాల్లో నైరాశ్యం నెలకొంది. అయితే ఈ ఫలితాలు ఎంతమేరకు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయా లేదా అన్నది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే. 

వ.నం       జాతీయ ఛానెల్స్            ఎన్డీఏ       యూపీఏ    ఇతరులు 
1.           ఇండియా టుడే                                                                  

2.          టైమ్స్ నౌ-వీఎంఆర్             306           132            104                                                                                                                

3.           రిపబ్లిక్ సీ ఓటర్స్                287            128             117

4.          న్యూస్ ఎక్స్ నేత సర్వే         298            118            127

5.          ఎన్.డి.టీవీ                          298           128            116

6.          రిపబ్లిక్ జన్ కీ బాత్             295-315      122-125     102-125

7.         న్యూస్ నేషన్                     282-290    118-126       130-138

8.          సువర్ణ న్యూస్ 24/7           295-315        122-125     102-125

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి

 

Follow Us:
Download App:
  • android
  • ios