MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నెలకు కేవలం రూ.250 మాత్రమే.. మీ ఫ్యామిలీకి ఒకేసారి రూ.60,00,000+20,000+10,000+10,000+1500

నెలకు కేవలం రూ.250 మాత్రమే.. మీ ఫ్యామిలీకి ఒకేసారి రూ.60,00,000+20,000+10,000+10,000+1500

SBI Accident Insurance Plan : మనకు ఏం జరిగినా సరే కుటుంబం కష్టాలపాలు కాకుండా ఉండాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. దీని కింద కుటుంబానికి ఎంత డబ్బు వస్తుందో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 18 2026, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎస్బిఐ యాక్సిడెంట్ పాలసీ
Image Credit : Gemini AI

ఎస్బిఐ యాక్సిడెంట్ పాలసీ

SBI Insurance : ప్రతిఒక్కరూ తన కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు... ఇందుకోసమే ఉద్యోగమైనా, వ్యాపారమైనా చేసేది. అయితే ఇంటి పెద్ద లేదా కుటుంబ బాధ్యతలు మోసేవారి సంపాదన కాస్త తగ్గినా ఆ ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందిపడాల్సి వస్తుంది... అలాంటిది ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోతే… ఆ కుటుంబం రోడ్డుమీద పడే పరిస్థితి వస్తుంది. 

ఇంట్లో సంపాదించేవారు హటాత్తుగా మరణించడంతో కష్టాలపాలవుతున్న కుటుంబాలను సమాజంలో చూస్తుంటాం. ఈ సమయంలో మనకు కూడా జరక్కూడనిది జరిగితే కుటుంబ పరిస్థితి ఇంతే కదా అనే భయం కలుగుతుంది. అందుకే మనం లేకున్నా కుటుంబానికి ఆర్థిక కష్టాలు రాకుండా ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఇలా ఆలోచించేవారి కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ యాక్సిడెంట్ పాలసీ పథకాన్ని ప్రారంభించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎస్బిఐ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్...
Image Credit : PR | Tigy George

ఎస్బిఐ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారుల కోసం రూ.60,00,000 యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకువచ్చింది. ఎస్బిఐలో అకౌంట్ ఉన్నవారు ఏడాదికి రూ.3,000 లు కడితే చాలు... ఆటోమెటిగ్గా యాక్సిడెంట్ భీమా యాక్టివేట్ అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ కలిగిన ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే అతడి కుటుంబానికి రూ.60,00,000 తో పాటు ఇతర అవసరాలకు కూడా ఆర్థిక సాయం అందిస్తుంది ఎస్బిఐ.

35
ఏ సమయంలో వర్తిస్తుంది... ఎప్పుడు వర్తించదు..?
Image Credit : Getty

ఏ సమయంలో వర్తిస్తుంది... ఎప్పుడు వర్తించదు..?

ఎస్బిఐలో అకౌంట్ కలిగివుండి పాలసీ యాక్టివేట్ లో ఉన్నవారు మరణించినా, ప్రమాదం కారణంగా అంగవైకల్యానికి గురయినా డబ్బులు లభిస్తాయి. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, విద్యుత్ ప్రమాదాల బారినపడి చనిపోయినా ఇన్సూరెన్స్ డబ్బులు లభిస్తాయి. అయితే ఆత్మహత్య, మాదకద్రవ్యాల కారణంగా మరణిస్తే ఈ ఇన్సూరెన్స్ వర్తించదు. వ్యాధులబారిన పడి చనిపోయినా ఈ పాలసీ వర్తించదు.

ప్రమాదానికి గురయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా లేదంటే శాశ్వత అంగవైకల్యానికి గురయినా ఎస్బిఐ నుండి మొత్తం పాలసీ డబ్బులు పొందవచ్చు. ఒకవేళ తాత్కాలిక అంగవైకల్యానికి గురయితే దాని తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. ప్రమాద పాలసీ పరిహారాన్ని నామినీ ఖాతాలో జమచేస్తారు.

45
పాలసీ డబ్బులకు రూ.41,500 అదనం..
Image Credit : ChatGPT

పాలసీ డబ్బులకు రూ.41,500 అదనం..

ఎస్బిఐ ఖాతాదారులు PAI స్కీమ్ కింద ఏడాదికి రూ.3,000 అంటే నెలకు రూ.250 చొప్పున చెల్లిస్తే చాలు. ప్రమాదవశాత్తు పాలసీ కలిగిన వ్యక్తి చనిపోతే నామినీకి రూ.60,00,000 పాలసీ డబ్బులు లభిస్తాయి. అంతేకాకుంటా చనిపోయినవారి సంపాదనపై ఆదారపడి చదువకునే పిల్లలుంటే వారి చదువుకు రూ.20,000 అదనంగా అందిస్తారు. ఇక పాలసీ కలిగిన వ్యక్తి అంత్యక్రియలు కుటుంబానికి భారం కాకుండా మరో రూ.10,000, అడాప్టేషన్ కు రూ.10,000, అంబులెన్స్ కోసం రూ.1500 చెల్లిస్తుంది ఎస్బిఐ. ఇలా మొత్తం రూ.60,41,500 రూపాయలు ప్రమాద పాలసీ రూపంలో లభిస్తాయి.

55
SBI పాలసీకి అర్హతలు..
Image Credit : Getty

SBI పాలసీకి అర్హతలు..

తప్పనిసరిగా ఎస్బిఐ అకౌంట్ కలిగివుండాలి.

18 నుండి 65 ఏళ్లలోపు వారు మాత్రమే అర్హులు.

ప్రమాద పాలసీని ప్రతిఏటా రెన్యువల్ చేయించుకోవాలి.

ఈ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ స్కీంకు సంబంధించిన మరింత సమాచారం కోసం దగ్గర్లోని SBI బ్రాంచ్ ను సంప్రదించండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Related Stories
Recommended image1
health insurance policy: రూ.500 కంటే తక్కువకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చా?
Recommended image2
LIC Policy: ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం లక్ష పెన్షన్ పొందే అద్భుతమైన స్కీమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved