National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వరుసగా మూడు రోజులు నుంచి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా బుధవారం ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈడీ తాజా నోటీసులతో నాలుగో రోజు విచారణను ఎదుర్కొనున్నారు.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా మూడో రోజు ప్రశ్నించింది. బుధవారం రోజున ఆయనను ఈడీ దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు ప్రశ్నించింది. ఇప్పటివరకు రాహుల్ గాంధీ 30 గంటలకు పైగా ఈడీ ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈ సమన్లను జారీ చేసింది. నోటీసులతో నాలుగో రోజు విచారించనుంది. శుక్రవారం నాడు మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆదేశించింది.
పలు మీడియా కథనాల ప్రకారం.. సెంట్రల్ ఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ గాంధీ బుధవారం ఉదయం 11.35 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఆయన వెంట ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ క్రమంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL), దాని యాజమాన్య సంస్థ యంగ్ ఇండియన్‌కు సంబంధించిన నిర్ణయాలలో రాహుల్ గాంధీ పాత్ర గురించి దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది.
ఆడియో, వీడియో రికార్డింగ్
మూడు రోజుల విచారణలో రాహుల్ గాంధీ వాంగ్మూలానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్ జరిగిందని అధికారులు చెబుతున్నారు. వారి వాంగ్మూలాలను ఏ4 సైజు పేపర్‌పై టైప్ చేసి చూపించి మినిట్ టు మినిట్ ప్రాతిపదికన సంతకం చేసి విచారణ అధికారికి అందజేస్తున్నారు. ఏజేఎల్‌కు చెందిన సుమారు రూ. 800 కోట్ల విలువైన ఆస్తులు, లాభాపేక్షలేని సంస్థ 'యంగ్ ఇండియన్' భూమి, ఆస్తులను ఎలా పొందుతున్నది? స్వచ్చంద సంస్థ పేరిట లైన్సెస్ పొంది వాణిజ్య కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తోందని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి.
మరోవైపు.. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ లేదని, షెడ్యూల్డ్ నేరం' కాదని కాంగ్రెస్ వాదిస్తోంది, దీని ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కేసు నమోదు చేసి రాహుల్ గాంధీ-సోనియా గాంధీలకు సమన్లు పంపాలి. ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకొని ప్రక్రియను కొనసాగించినందున, ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా జరిపిన చర్యల కంటే ఇడి చర్యలు చాలా స్పష్టంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ నిరసనలు
రాహుల్ గాంధీని ఈడీ విచారించిన మూడవ రోజు కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలువురి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం చూట్టు పక్కల ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పలు మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ.. గురువారం రాష్ట్రపతి, హోంమంత్రిశాఖల అపాయింట్‌మెంట్ కోరుతుంది. సమయం ఇస్తే.. 5 మంది నేతలతో కూడిన ప్రతినిధి బృందం సమావేశమై ED, ఢిల్లీ పోలీసుల చర్యపై ఫిర్యాదు చేయనున్నది.
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకోకుండా పార్టీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారని, ఇద్దరు ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్‌లను మాత్రమే '24 అక్బర్ రోడ్'కి చేరుకోవడానికి అనుమతించారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ వ్యవహరంపై రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మాట్లాడుతూ.. పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ‘దేశంలో ఏం జరుగుతోంది? మన దేశంలో రాజకీయ వ్యవస్థ ఉండా ? లేదా ప్రజాస్వామ్యమా? అన్ని ప్రశ్నించారు. అధికార బీజేపీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుందని ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మాట్లాడుతూ.. మొదటి రోజు (సోమవారం) 200 మంది కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. నిన్న, నేడు సందర్శనపై పరిమితిని విధించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించగలరని చెప్పారు. ఉద్యోగులు కూడా చేరుకోలేకపోతున్నారు. అది ఎప్పుడూ జరగలేదని అన్నారు.
