National Herald Case:  నేషనల్‌ హెరాల్డ్‌ వార్తా పత్రిక మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విచారణ తేదీని మార్చింది. ఈ నెల 13న విచార‌ణ‌కు ఈడీ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. ఈ మేర‌కు మ‌రోమారు సమన్లు ​​జారీ చేసింది 

National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ వార్తా పత్రిక మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మ‌రోసారి సమన్లు ​​జారీ చేసింది. నూత‌నంగా జారీ చేసిన‌ స‌మ‌న్ల ప్ర‌కారం.. జూన్ 13-14 తేదీలలో విచార‌ణ‌కు హాజరు కావాలని ED ఆదేశించింది. గ‌తంలో ఈ నెల 2న హాజ‌రు కావాల‌ని రాహుల్ ను ఆదేశించిన విష‌యం తెలిసిందే.. అయితే.. తాను విదేశీ పర్యటనలో ఉన్నట్లు విచారణ తేదీని వాయిదా వేయాలని దర్యాప్తు సంస్థకు ఆయన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో విచారణ తేదీని వాయిదా వేసింది. కాగా, రాహుల్ జూన్‌ 5న స్వదేశానికి తిరిగి రానున్నారు.

ఇదే.. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. జూన్ 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ, ఆమెకు కరోనావైరస్ సోకినట్లు కాంగ్రెస్ గురువారం తెలిపింది. ఈ విషయాన్ని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గురువారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్థ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు కూడా కరోనా సోకినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత వారం రోజులుగా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారని సూర్జేవాలా తెలిపారు. వీరిలో కొందరికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. 

 కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. “డాక్టర్ సలహా మేరకు, కాంగ్రెస్ అధ్యక్షుడు హోం క్వారంటైన్‌లో ఉన్నార‌నీ, ఆమె ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందాల్సినవ‌స‌రం లేద‌నీ, ఆమె క్షేమంగా ఉన్నారని, ఆమె ఆరోగ్యం త్వ‌ర‌లోనే మెరుగుపడుతుందని కోరుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు జూన్ 8 న ED ముందు హాజరవుతారని తెలియ‌జేశారు. 

ఈడీ చ‌ర్య‌ల‌ను కాంగ్రెస్ ప్రతీకార చర్య అని ఆరోపించింది. దేశాన్ని తప్పుదోవ పట్టించడానికి బీజేపీ పిరికిపంద కుట్ర పన్నిందని పేర్కొంది. బీజేపీ చ‌ర్య‌ల‌నుకు కాంగ్రెస్ నాయ‌క‌త్వం భ‌య‌పడ‌ద‌ని, తలవంచబోద‌ని సూర్జేవాలా అన్నారు. సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలను జూన్ 8న హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరడం గమనార్హం. రాహుల్ హాజరు కావడానికి జూన్ 2 లేదా 3 తేదీలు ఇవ్వబడ్డాయి, అయితే అతని కార్యాలయం జూన్ 5 తర్వాత తేదీని కోరింది.

ప్రియాంక గాంధీ క‌రోనా..

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా కోవిడ్‌ బారినపడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆమె త‌న ట్విటర్ హండిల్ లో వెల్లడించారు. క‌రోనా ల‌క్ష‌ణాలు స్ప‌ల్వంగా ఉండ‌టంతో కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్ అని తేలిందని ఆమె పేర్కొన్నారు. ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను క‌లిసిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు.