అంతర్జాతీయ వేదికపై గ్రామీ విజేత అయిన రికీ కేజ్ జాతీయ గీతాన్ని సరికొత్త రీతిలో ప్రదర్శించారు. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లండన్‌లో ఉన్న ప్రతిష్టాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా సహకారంతో రికీ కేజ్ జాతీయ గీతాన్ని అత్యద్బుతంగా ప్రదర్శించారు. ఇందులో ఇందులో 100 మంది సభ్యులతో కూడిన రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా భాగస్వామ్యం అయ్యింది. 

భారతదేశ జాతీయ గీతం ‘జన గణ మన’, ఈ గీతం ప్రతి భారతీయుడికి ఇది ఎంతో ప్రత్యేకమైనది.ఇది మన గుర్తింపు, మన గౌరవం, మన సార్వభౌమత్వానికి చిహ్నం.ఎక్కడైనా జాతీయ గీతం వినిపించినా, పాడినా మనసు గర్వంతో ఉప్పొంగుతుంది. ఈ జాతీయ గీతాన్ని ఎన్నోసార్లు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. అయినా ఎప్పడకప్పడూ ప్రత్యేకమే..

తాజాగా అంతర్జాతీయ వేదికపై మూడు సార్లు గ్రామీ విజేత పొందిన రికీ కేజ్ జాతీయ గీతాన్ని అద్బుతంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శన వేరే లెవల్ అనే చెప్పాలి. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా సహకారంతో రికీ కేజ్ భారత జాతీయ గీతాన్ని అత్యద్బుతంగా ప్రదర్శించారు. 100 మంది సభ్యులతో కూడిన రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో అసాధారణ ప్రదర్శనిచ్చి ఒ ప్రత్యేక రికార్డు నెలకొల్పారు. ఈ గూస్ బంస్స్ ప్రదర్శనకు లండన్‌లోని ఐకానిక్ అబ్బే రోడ్ స్టూడియోస్‌లో వేదికైంది.

ఈ సందర్భంగా గ్రామీ విజేత, సంగీత విద్వాంసుడు రికీ కేజ్ ఆసియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ విశేషాలను పంచుకున్నారు. అంతర్జాతీయ కళాకారులు( లండన్ ఆర్కెస్ట్రా)తో కలిసి రికార్డ్ క్రియేట్ చేయడమే తన లక్ష్యమని, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బృందాలున్నాయని చెప్పాడు. అందులో రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా టాలెంట్ అసమానమైనదిగా పేర్కొంటూ.. ఈ ప్రదర్శన కోసం వారు ప్రాణం పెట్టి పనిచేశారని తెలిపారు.

తనతో పనిచేసిన వారికి చలనచిత్ర రంగంలో విస్తృత అనుభవం ఉందని తెలిపారు. గీతాన్ని పునఃరూపకల్పనలో చేసేందుకు తాను మూడు నెలల ప్రణాళికాబద్ధంగా పని చేశానని తెలిపారు. రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాలోని ప్రతి సభ్యుడు ఎంతో నిబద్దతతో పనిచేశారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం మూడు నెలలపాటు శ్రమించామనీ, రికార్డింగ్ మాత్రం కేవలం 45 నిమిషాల్లోనే జరిగిపోయిందని ఆయన అన్నారు. కేవలం నాలుగైదు రిహార్సల్స్‌లోనే చాలా పర్ఫెక్ వచ్చిందని అన్నారు. 

ఈ ప్రయత్నం వెనుక తనకు ఓ ప్రత్యేక ఆకాంక్ష ఉందని అన్నారు. జాతీయ గీతాన్ని అత్యుత్తమ ప్రదర్శించాలనేదే తన కోరిక అని అన్నారు. కార్పోరేట్ స్పాన్సర్‌షిప్ లేకుండా మొత్తం ప్రాజెక్ట్ ను తన స్వంత నిధులతో నిర్వహించమని సంగీత విద్వాంసుడు రికీ కేజ్ తెలిపారు.

200 సంవత్సరాల పాటు మనల్ని బ్రిటీష్ వారు పాలించారు. నేడు ఆ దేశానికి చెందిన వారు కూడా భారతీయ జాతీయ గీత ప్రదర్శనలో భాగమయ్యారనీ, వారి (రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా) ప్రోత్సహం లభించడం చాలా అద్భుతమని అన్నారు గ్రామీ అవార్డు గ్రహీత సంగీతకారుడు. బ్రిటీష్ ఆర్కెస్ట్రా భారత జాతీయ గీతాన్ని ప్రదర్శించడం న్యూ ఇండియా అంటే ఏమిటో ప్రతిబింబిస్తుందనీ, ఎలాంటి రాయల్టీ అంచనాలు లేకుండా ప్రపంచ భారతీయ సమాజానికి ఈ రెండిషన్‌ను బహుమతిగా అందించాలనేది తన ఉద్దేమని అన్నారు.