కాస్తా కష్టం వస్తే చాలు.. తమ జీవితం ఇక ముగిసి పోయిందని కొందరు బాధపడుతున్నారు. అసలు తమకు తప్ప ఈ భూమ్మీద ఇంకెవరికీ కష్టాలు లేవన్నంతగా మథనపడుతారు. కానీ.. చదువులో రాణించడానికి పేదరికం అడ్డంకి కాదని నిరూపించారు నర్గీస్ సుల్తానా, హఫీజా బేగం. వారి సక్సెస్ స్టోరీ మీ కోసం ..
కాస్తా కష్టం వస్తే చాలు తమ జీవితం ఇక ముగిసి పోయిందని బాధపడుతున్నారు నేటి యువత. అసలు తమకు తప్ప ఈ భూమ్మీద ఇంకెవరికీ కష్టాలు లేవన్నంతగా మథనపడుతారు. ముఖ్యంగా చదువుకోవాల్సిన సమయంలో ఎదురైతే.. చాలా మంది తమ చదువును మధ్యలోనే ఆపేస్తారు. మరీ ముఖ్యంగా పేదరికంలోని ఉండి చదువుకోవాలని భావించే ముస్లిం అమ్మాయి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తొలుత ఆడపిల్లనే భారంగా భావిస్తారు. తొందరగా పెళ్లి చేసి ఓ అబ్బాయి చేతిలో పెట్టాలను అనుకుంటారు. అలాంటి పరిస్థితులను అధిగమించి.. డాక్టర్ అయ్యింది ఓ ముస్లిం యువతి. పేదరికాన్ని ఎదురించి నిలిచిన నర్గీస్ సుల్తానా నేడు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. నర్గీస్ సుల్తానా, హఫీజా బేగంల సక్సెస్ స్టోరీ మీ కోసం ..
2022 మెట్రిక్యులేషన్ పరీక్షలో వివిధ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మౌలానా కుమార్తె నర్గీస్ సుల్తానా. తాను డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకోవడానికి రోజుకు 12 గంటల నుంచి 14 వరకు చదివింది. ఇలా ఎన్నోకష్టాలను అధిగమించి, కలలకు రెక్కలు ఇచ్చింది. డాక్టర్ గా మారింది. దర్రాంగ్ జిల్లాలోని దల్గావ్‌లోని కచారి భేటీ నివాసితులు సంషేర్ అలీ, నసీరా ఖాతూన్‌ల రెండవ కుమార్తె నర్గీస్. చాలా వెనుకబడిన . మారుమూల ప్రాంతంలో జన్మించిన నర్గీస్ తన ప్రాథమిక విద్య కోసం తన పాఠశాలకు చేరుకోవడానికి తన ఇంటి నుండి రోజూ 5-6 కిమీ నడిచి నదిని దాటవలసి వచ్చేంది. నర్గీస్ మౌలానా కుమార్తె కావడంతో ఆమె గ్రామంలోని చాలా మంది నివాసితులు ఆధునిక విద్య కోసం పాఠశాలకు వెళ్లకుండా పవిత్ర ఖురాన్‌తో సహా ఇస్లామిక్ పాఠ్యపుస్తకాలను నేర్చుకోవాలని కోరారు. అయితే నర్గీస్ స్కూల్‌కి వెళ్లాలని నిశ్చయించుకుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు మద్దతు ఇచ్చారు.

నర్గీస్ సుల్తానా అవాజ్-ది వాయిస్‌తో మాట్లాడుతూ.. "నేను 2022లో పదో తరగతి ఫైనల్ పరీక్షలో అత్యున్నత ప్రతిభ కనబరిచాను. నా విజయంలో నా కృషి, అంకితభావంతో పాటు ఉపాధ్యాయులకు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. నా ఆర్థిక నేపథ్యాన్ని తెలుసుకున్న తర్వాత వారు (ఉపాధ్యాయులు) నా విద్యను కొనసాగించడానికి నాకు సహాయం చేసారు. నేను చదువుకున్న ఆనందరామ్ బారువా అకాడమీ యాజమాన్యం కూడా ఎటువంటి రుసుము వసూలు చేయలేదు.తొమ్మిది, పదో తరగతిలో నాకు ఉచిత ట్యూషన్‌ను అందించింది. మెట్రిక్ పరీక్ష 2022లో నాకు సాంఘిక శాస్త్రంలో 96 (100 మార్కులకు), గణితంలో 95, అస్సామీలో 92, ఎలక్టివ్ సబ్జెక్టులలో 90, ఇంగ్లీషులో 90, జనరల్ సైన్స్‌లో 78 మార్కులు సాధించాను. అని తన పాఠశాల జీవితం గురించి తెలిపింది నర్గీస్ సుల్తానా .
'పదో తరగతి తరువాత హోజాయ్‌లోని అజ్మల్ కాలేజీలో హయ్యర్ సెకండరీ (ఇంటర్మీడియట్) చదివాను. నా విద్యను కొనసాగించడానికి చాలా మంది వ్యక్తులు , ఉపాధ్యాయులు నాకు ఆర్థిక సహాయం చేశారు. వారు నాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి, నేను వారిని నిరాశపరచలేను. నేను రోజూ 10 గంటలకు పైగా చదువుతున్నాను. ఆ సమయంలోనే నేను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. గైనకాలజిస్ట్‌గా మారి గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సేవలందించాలని ఫిక్స్ అయ్యాను' అని నర్గీస్ తెలిపారు.
తన కుమార్తె విద్యను కొనసాగించడానికి సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు నసీరా ఖాతూన్ (నర్గీస్ తండ్రి). నర్గీస్ భవిష్యత్తులో పేద ప్రజలకు చేయాలని, ఆరోగ్యాలను అండగా నిలువాలని అన్నారు. ఆమె భవిష్యత్తులో విజయవంతమైన వైద్యురాలు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అదేవిధంగా దర్రాంగ్ జిల్లాలోని దల్గావ్‌కు చెందిన మరో ముస్లిం విద్యార్థి హఫీజా బేగం కూడా చదువులో రాణించడానికి పేదరికం అడ్డంకి కాదని నిరూపించింది. ఇ-రిక్షా డ్రైవర్ హబీబ్ ఉల్లా కుమార్తె హఫీజా. దల్గావ్‌లోని ఆదర్శ్ జాతీయ విద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ పరీక్షలో డిస్టింక్షన్ మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. హఫీజా డాక్టర్ కావాలని నిర్ణయించుకుంది. తరువాత యూనియన్ సివిల్ సర్వీస్ పరీక్షకు సిద్ధం అవుతుంది.
రచయిత: మున్నీ బేగం - గౌహతి
