Asianet News TeluguAsianet News Telugu

58 మందితో మోడీ కొలువు: సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి, ఎపికి దక్కని చోటు

ప్రధాని నరేంద్ర మోడీ కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. ప్రధాని మోడీ సహా 58 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా, 9 మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 24 మంది సహాయ మంత్రులు. తెలంగాణ నుంచి జి. కిషన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికీ చోటు దక్కలేదు.

narendra modi swearing ceremony
Author
New Delhi, First Published May 30, 2019, 7:07 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. ప్రధాని మోడీ సహా 58 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా, 9 మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 24 మంది సహాయ మంత్రులు. తెలంగాణ నుంచి జి. కిషన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికీ చోటు దక్కలేదు.

దేబాశ్రీ చౌదరి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ నుంచి ఆమె ఎంపీగా గెలుపొందారు. 

కైలాష్ చౌదరి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్‌లోని బర్మేర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.

ప్రతాప్ చంద్ర సారంగి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిషాలోని బాలాసోర్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రామేశ్వరి తేలి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాంలోని డిబ్రుఘర్ నుంచి వరుసగా రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

సోమ్ ప్రకాశ్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లోని హోషియార్ పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన గతంలో ఐఏఎస్ అధికారికిగా సేవలందించారు.

రేణుకా సింగ్ సరుటా కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మురళీధరన్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోడీ తొలి కేబినెట్‌లో మంత్రిగా సేవలందిస్తున్నారు.

రతన్‌లాల్ కటారియా కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలోని అంబాలా నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు.

నిత్యనంద్ రాయ్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్‌లోని ఉజియార్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

సురేశ్ అంగాడీ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటకలోని బెళగావి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

అనురాగ్ సింగ్ ఠాకూర్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోనీ హామీర్‌పురా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మోడీ తొలి కేబినెట్‌లోనూ మంత్రిగా సేవలందించారు.

సంజయ్ శ్యామ్‌రావ్ ధోత్రే కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రలోని అకోలా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

సంజీవ్ కుమార్ బలీయాన్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

కేంద్రమంత్రిగా బాబుల్ సుప్రియో ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్‌‌లోని అసన్ సోల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మోడీ తొలి కేబినెట్‌లో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా సేవలందించారు.

నిరంజన్ జ్యోతి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మోడీ తొలి కేబినెట్‌లో సహాయ మంత్రిగా పనిచేశారు.

రాందాస్ అథవాలే కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన.. మోడీ తొలి కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

పరుషోత్తమ్ రూపాలా కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన.. మోడీ తొలి కేబినెట్‌లో పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.

కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సికింద్రాబాద్ నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయన .. గతంలో అంబర్‌పేట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించారు. కిషన్ రెడ్డి హిందీలో ప్రమాణం చేశారు.

రావ్‌సాబ్  దాన్వే కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రలోని జాల్నా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

కిసన్ పాల్ గుజ్జర్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన.. గతంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మోడీ తొలి కేబినెట్‌లో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

అర్జున్ రామ్ మేఘ్‌వాల్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మోడీ తొలి కేబినెట్‌లో నీటి పారుదల, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ ఎఫైర్స్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

వీకే సింగ్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మోడీ తొలి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అశ్వినీ కుమార్ చౌబే కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్‌లోని బక్సార్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

కులస్తే కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌లోని మాండ్లా నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

మన్సూక్ మాండవీయ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మోడీ తొలి కేబినెట్‌లోనూ మంత్రిగా పనిచేశారు.

హరిదీప్‌సింగ్ పూరీ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దౌత్యవేత్తగా పనిచేసిన ఆయన తాజా ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

రాజ్‌కుమార్ సింగ్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్‌లోని అర్రా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కేంద్రమంత్రిగా ప్రహ్లాద్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌లోని దామో నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన .. ఆ రాష్ట్ర బీజేపీలో పలు స్థాయిల్లోపనిచేశారు. వాజ్‌పేయ్ హయాంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా సేవలందించారు. 

కిరెణ్ రిజుజు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి కీలకనేతగా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోడీ తొలి కేబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.

కేంద్రమంత్రిగా జితేంద్ర సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని ఉదమ్ పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోడీ తొలి కేబినెట్‌లో సహాయ మంత్రిగా సేవలందించారు. ఈయన వైద్యుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగానూ పనిచేశారు.

శ్రీపాద్ యశో నాయక్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

రావ్ ఇంద్రజీత్ సింగ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ ‌నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. మోడీ తొలి కేబినెట్‌లో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

కేంద్రమంత్రిగా సంతోష్ కుమార్ గాంగ్వార్ ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ తొలి కేబినెట్‌లో కార్మిక శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరౌలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ప్రస్తుత లోక్‌సభలో బీజేపీ సీనియర్ సభ్యుడు.

గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. మోడీ తొలి కేబినెట్‌లో వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. గతంలో రాజస్థాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.

కేంద్రమంత్రిగా గిరిరాజ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్‌లోని బెగుసరాయ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన మోడీ మొదటి కేబినెట్‌లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

కేంద్రమంత్రిగా అరవింద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. శివసేనకు చెందిన ఆయన దక్షిణ ముంబై నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. గతంలో మహారాష్ట్ర అసెంబ్లీకి రెండు సార్లు ఎన్నికయ్యారు. 

మహేంద్రనాథ్ పాండే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 

ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి వరుసగా మూడో సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించారు. 

కేంద్రమంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రమాణ స్వీకారం చేశారు. విద్యార్ధి ఉద్యమ నేతగా పార్టీలో గుర్తింపు పొందిన ఆయన.. వాజ్‌పేయ్ హయాంలోనూ మంత్రిగా పనిచేశారు.  మోడీ తొలి కేబినెట్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

ధర్మేంద్ర ప్రధాన్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిషాలోని డియోఘర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో మోడీ తొలి మంత్రి వర్గంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేశారు. 

కేంద్రమంత్రిగా పీయూష్ గోయెల్ ప్రమాణ స్వీకారం చేశారు. వృత్తిరీత్యా ఛార్టెడ్ ఎకౌంటెంట్ అయిన ఆయన మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోడీ గత ప్రభుత్వంలో రైల్వే, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

ప్రకాశ్ జవదేకర్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మోడీ గత ప్రభుత్వంలో స్వతంత్ర హోదాలో పర్యాటక శాఖ, మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ అధికార ప్రతినిధిగా ఎన్నో ఏళ్లు సేవలు అందించారు. 

కేంద్రమంత్రిగా హర్షవర్థన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని చాందీని చౌక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మోడీ తొలి కేబినెట్‌లో శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

స్మృతీ ఇరానీ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహిళానేతగా బీజేపీతో గుర్తింపు పొందారు. గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన ఆమె గత మంత్రివర్గంలో మానవ వనరులు, జౌళీ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అమేథీలో ఓడించారు. 

అర్జున్ ముండా కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా ఉద్యమ నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కుంతి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 

రమేశ్ పోఖ్రియాల్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన .. ప్రస్తుతం హరిద్వార్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

కేంద్రమంత్రిగా సుబ్రమణ్యం జయశంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. విదేశాంగ శాఖ కార్యదర్శిగా నాలుగు దశాబ్ధాల అనుభవం ఆయన సొంతం. ఈయన ఏ చట్టసభలోనూ సభ్యుడు కారు. 

థావర్ చంద్ గెహ్లాట్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. గతంలో బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

కేంద్రమంత్రిగా హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ప్రమాణ స్వీకారం చేశారు. శిరోమణి అకాలీ దళ్‌ పార్టీకి చెందిన ఈమె పంజాబ్‌లోని భటిండా స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. గత ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

కేంద్రమంత్రిగా రవిశంకర్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాసాహెబ్ నుంచి తాజా ఎన్నికల్లో గెలుపొందిన ఆయన గతంలో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. మోడీ మొదటి మంత్రివర్గంలో న్యాయ, ఐటీ శాఖ మంత్రిగా సేవలందించారు. 

కేంద్రమంత్రిగా నరేంద్ర సింగ్ తోమర్ ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి మంత్రివర్గంలో రూరల్ డెవలప్‌మెంట్ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 

లోక్‌జన శక్తి పార్టీ అధ్యక్షుడు రామ్ విలాశ్ పాశ్వాన్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 8 సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన యూపీఏ హయంతో పాటు మోడీ మొదటి మంత్రివర్గంలోనూ మంత్రిగా బాధ్యలు నిర్వర్తించారు. 

కేంద్రమంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రమాణం చేశారు. కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న ఆమె మోడీ మొదటి మంత్రివర్గంలతో వాణిజ్య, రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇందిరా గాంధీ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 

డివి సదానందగౌడ కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన .. గత ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. బెంగళూరు నార్త్ నుంచి తాజా ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 

కేంద్రమంత్రిగా నితిన్ గడ్కరీ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రకు చెందిన ఈయన బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. నాగ్‌పూర్‌ నుంచి గెలిచిన ఆయన గత మంత్రివర్గంలో రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా పనిచేశారు. 

అమిత్ షా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్నటి వరకు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న ఆయన.. తాజా ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనను మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అమిత్‌కు ఆర్ధిక శాఖ దక్కింది.

 

రాజ్‌నాథ్ సింగ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ తొలి కేబినెట్‌లో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు ఈసారి కూడా అదే పదవిలో కొనసాగించే అవకాశం ఉంది. 

ప్రధానిగా నరేంద్రమోడీ రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బ్రిక్స్, బిమ్‌స్టిక్ దేశాధినేతలు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. నరేంద్రమోడీతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios