భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్సనల్ వెబ్ సైట్ కి చెందిన ట్విట్టర్ అకౌంట్ హాక్ అయింది. నరేంద్ర మోడీ పర్సనల్ వెబ్ సైట్ అకౌంట్ హ్యాక్ అయినట్టు ట్విట్టర్ ధృవీకరించింది కూడా. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, నరేంద్ర మోడీ అకౌంట్ ను హ్యాకర్ల చెర నుండి విడిపించేందుకు పని చేస్తున్నామని ట్విట్టర్ తెలిపింది. 

గురువారం రోజు తెల్లవారుజామున 3.15 ప్రాంతంలో హ్యాకర్లు ఈ అకౌంట్ ను హ్యాక్ చేసినట్టు తెలియవస్తుంది. జాన్ విక్ అనే వ్యాక్తి తానే ఈ అకౌంట్ ని హ్యాక్ చేసినట్టు అక్కడే ఒక ట్వీట్ ద్వారా ప్రకటించుకున్నాడు. (ఆ ట్వీట్ తర్వాత తొలిగించబడింది)

ప్రధానమంత్రి సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయాలని హ్యాకర్లు డిమాండ్ చేసారు. గత జులై లో సైతం ఇలాగే హ్యాకర్లు ప్రముఖుల అకౌంట్లను హ్యాక్ చేసారు. అమెరికా అధ్యక్షా బరిలో ఉన్న జో బిడెన్, మజీవు అధ్యక్షుడు ఒబామా, వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ వంటి ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసారు.