జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలో లష్కరే తోయిబా చెందిన నలుగురు సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎనిమిది కిలోల హెరాయిన్ , ఐదు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో అంతర్ రాష్ట్ర నార్కో మాడ్యూల్‌ను ఛేదించారు. వారి నుంచి డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ నుంచి పనిచేస్తున్న ఈ అంతర్రాష్ట్ర నార్కో మాడ్యూల్‌లోని నలుగురు సభ్యులను అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలను విక్రయిస్తారని, వాటి నుంచి వచ్చిన డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్‌కు చెందిన ఒక నార్కో స్మగ్లర్ మాదక ద్రవ్యాల సరుకును సేకరించడానికి జిల్లాలోని ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి వచ్చాడనే సమాచారంతో కుప్వారా పోలీసులు, స్థానిక ఆర్మీ యూనిట్‌తో కలిసి సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో యూసుఫ్ బోక్రా, షౌకత్ అహ్మద్ ఖతానా, మరూఫ్ అహ్మద్ మీర్, లాబా మసీహ్ అనే 4 మంది వ్యక్తులు అరెస్టు చేశారు. అరెస్టయిన నలుగురితో పాటు ఎనిమిది కిలోల హెరాయిన్, రూ. ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కుప్వారా సీనియర్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) యుగల్ మన్హాస్ తెలిపారు.
జుమాగండ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు నివాసితులు మంజూర్ అహ్మద్ , అసద్ మీర్ లు డ్రగ్స్, ఆయుధ రవాణాకు నాయకత్వం వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారు హ్యాండ్లర్లుగా పనిచేస్తున్నారు. 1990లలో పీఓకేలోకి చొరబడి వీరు పీఓకేలో నివసిస్తున్నారు. మంజూర్,అసద్ ఇద్దరూ కాలక్రమేణా LeT తీవ్రవాద నిర్వాహకులుగా మారారు. ప్రధానంగా లాంచ్ కమాండర్లుగా, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించడానికి మాదక ద్రవ్యాలు,ఆయుధాలను తరలిస్తున్నారు.
SSP యుగల్ మన్హాస్ మాట్లాడుతూ.. “మంజూర్ తన బంధువు మరూఫ్ అహ్మద్‌ను ఉపయోగించి డ్రగ్స్, ఆయుధాలను సరఫరా చేస్తున్నారు. కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, మరిన్ని అరెస్టులు, జప్తులను జరుగుతాయని ఎస్‌ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం లష్కర్ తన హ్యాండ్లర్లను ఉపయోగించి మాదక ద్రవ్యాల సరాఫరా చేస్తున్నట్లు ఎస్ఎస్పీ తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు , వారి కార్యకలాపాలకు సహాయం చేసే లక్ష్యంతో ఈ సరుకుల నుండి డబ్బు ప్రాసెస్ చేయబడింది. ఈ ప్రత్యేక ముఠాను పట్టుకోవడం సైన్యం, పోలీసులకు పెద్ద విజయమని SSP చెప్పారు. ఎన్‌డిపిఎస్ చట్టం , యుఎ (పి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ట్రెహ్‌గామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున మరిన్ని అరెస్టులు, రైడ్స్ జరగవచ్చని పోలీసులు తెలిపారు.
