High Court on Suicide Note : పంజాబ్ హర్యానా హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. సూసైడ్ నోట్ లో ఒక వ్యక్తి పేరు ఉన్న మాత్రాన సదరు వ్యక్తిపై ఆరోపించిన నేరాలకు నిర్థారించలేమని, నిందితుడిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాతనే అతని దోషిగా నిర్థారించగలమని పంజాబ్ హర్యానా HC పేర్కొంది.
High Court on Suicide Note : పంజాబ్ హర్యానా హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. సూసైడ్ నోట్ లో ఒక వ్యక్తి పేరు ఉన్న మాత్రాన సదరు వ్యక్తిపై ఆరోపించిన నేరాలకు నిర్థారించలేమని, నిందితుడిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాతనే అతని దోషిగా నిర్థారించగలమని పంజాబ్ హర్యానా HC పేర్కొంది.
సూసైడ్ నోట్‌లో విషయంలో పంజాబ్ హర్యానా హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. సూసైడ్ నోట్ లో ఒక వ్యక్తి పేరు ఉన్న మాత్రాన సదరు వ్యక్తిపై ఆరోపించిన నేరాలకు నిర్థారించలేమని, నిందితుడిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాతనే అతని దోషిగా నిర్థారించగలమని పంజాబ్ హర్యానా HC పేర్కొంది.
వివరాల్లోకెళ్లే.. ఫిబ్రవరి 17, 2019న మంజిత్‌లాల్ పంజాబ్ నివాసి. అతనిపై తన బావమరిది బల్జీందర్ కుమార్‌తో పాటు మరో 6 మంది వ్యక్తులతో దాడి చేసాడు. తరువాత మంజిత్ లాల్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తన మరణానికి ప్రధాన కారణం.. బల్జీందర్ కుమార్, హర్భజన్ సంధు లేనని తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. దీంతో మంజిత్‌లాల్ తండ్రి జస్విందర్‌లాల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కుమారుడు మరణానికి ప్రధాన కారణం బల్జీందర్ కుమార్, హర్భజన్ సంధు తో పాటు మరో ఏడుగురుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మృతుడి కుటుంబం తరఫున ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని హర్భజన్ సంధు అనే వ్యక్తి పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 కింద దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో హర్భజన్ సంధు తరపు న్యాయవాది క్రిషన్‌సింగ్ దద్వాల్ సూసైడ్ నోట్ ఆధారంగా.. ఓ వ్యక్తిని దోహిగా నిర్థారించలేమనీ, సూసైడ్ నోట్ చెల్లదనీ, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 ప్రకారం నిందితులను దోషులుగా నిర్ధారించలేమని హర్భజన్ సంధు తరపు న్యాయవాది క్రిషన్‌సింగ్ దద్వాల్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, 2019లో దాఖలు చేసిన మొదటి ఎఫ్‌ఐఆర్‌లో హర్భజన్ సంధు పేరు లేదని తేల్చి చెప్పారు.
హర్భజన్ సంధు తరపు న్యాయవాది క్రిషన్‌సింగ్ వాదనతో ఏకీభవించిన కోర్టు ..సూసైడ్ నోట్‌లో పేరు ఉంటే ఆ ఆరోపణలను రుజువు చేయలేమని, ఈ కేసులో సూసైడ్ నోట్ సరైనదని తేలినప్పటికీ, నిందితులపై సాక్ష్యాధారాలు సరిపోవని, దీంతో నిందితులను విచారించలేమని కోర్టు తేల్చి చెప్పింది.
