Asianet News TeluguAsianet News Telugu

మీరేమంటారు: నళినికి పెరోల్‌పై హైకోర్టు

దివంగత ప్రధానమంత్రి  రాజీవ్ గాంధీ హత్య కేసులో  శిక్షను అనుభవిస్తున్న నళినికి పెరోల్ విషయమై తమ అభిప్రాయం తెలపాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

Nalini seeks parole for daughters wedding
Author
Chennai, First Published Apr 15, 2019, 11:57 AM IST

చెన్నై: దివంగత ప్రధానమంత్రి  రాజీవ్ గాంధీ హత్య కేసులో  శిక్షను అనుభవిస్తున్న నళినికి పెరోల్ విషయమై తమ అభిప్రాయం తెలపాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తన కూతురు వివాహం కోసం ఆరు మాసాల పాటు పెరోల్ ఇవ్వాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించింది.  కూతురు పెళ్లి ఏర్పాట్లను చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆరు మాసాలు పెరోల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది.

రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని జీవిత ఖైదును అనుభవిస్తున్న విషయం తెలిసిందే.  2000 సంవత్సరం నుండి ఆమె జైల్లోనే ఉన్నారు.పలు కేసుల్లో జీవిత ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్న3700 మందిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పదేళ్ల శిక్షను పూర్తి చేసుకొన్న వారిని విడుదల చేసింది.

అయితే రాజీవ్ గాంధీ హత్య  కేసులో జీవిత ఖైదులుగా జైల్లో మగ్గుతున్న ఏడుగురిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్‌లోనే ఉంది.


సంబంధిత వార్తలు

రాజీవ్‌ గాంధీ హత్య: జైల్లో నళిని దంపతుల నిరాహార దీక్ష

Follow Us:
Download App:
  • android
  • ios