Asianet News TeluguAsianet News Telugu

పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. నాగపూర్ లో మార్చి వరకు స్కూళ్లు బంద్...

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. 

nagpur schools and colleges to remain shut till 7 march amid covid spike - bsb
Author
Hyderabad, First Published Feb 23, 2021, 10:53 AM IST

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. 

మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే  ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతి, యావత్మల్ జిల్లాల్లో లాక్ డౌన్ విధించారు.

పూణేలో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ఇక ఇప్పుడు నాగ్ పూర్ లో మార్చి 7వ తేదీ వరకు స్కూళ్ళు, కాలేజీలను మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నాగ్ పూర్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  

మంగళవారం సాయంత్రం బృహత్ ముంబై అధికారులతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సమావేశం కాబోతున్నారు. ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులపై సమీక్షించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios