నాగపూర్: హైదరాబాద్ లో అత్యంత అమానుషమైన దిశ దుర్ఘటన అనంతరం దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజలంతా గొంతెత్తి జస్టిస్ ఫర్ దిశ అని నినదిస్తున్నారు. రేపిస్టులను క్షమించకూడదంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు. 

ఈ ఉదంతం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ముఖ్యంగా మహిళల రక్షణకోసం, ఒకవేళ ఒంటరి మహిళల వాహనాలు పాడైతే తమకు సమాచారం అందించాలని కోరారు. తాము అక్కడకు చేరుకుంటామని పోలీసులు అభయమిస్తున్నారు. నాగపూర్ పోలీసులు కూడా ఈ విషయమై మహిళలకు అభయమిస్తున్నారు. 

నాగపూర్ పోలీసులు ఇంకో అడుగు ముందుకేసి ఒంటరిగా ఎక్కడైనా నిర్మానుష్యమైన ప్రదేశాల్లో మహిళలు చిక్కుబడిపోతే తమకు ఫోన్ చేస్తే చాలని, తాము వచ్చి వారిని ఇంటి దగ్గర దిగబెడుతామని హామీ ఇస్తున్నారు. ఈ విధంగా పోలీసులు మహిళలకు తాము అండగా ఉన్నామనే మెసేజ్ ని పంపినట్టయ్యింది. 

ప్రస్తుతం ఈ ఘటనకు కారకులైన నలుగురు నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు. కాగా... ప్రధాన నిందితుడు ఆరిఫ్... దిశ ఘటనకు సంబంధించి ఓ భయంకర నిజాన్ని జైల్లో బయటపెట్టాడు.

ఇప్పటి వరకు దిశను ముక్కు, మూతి మూసి హత్య చేశారని... ఆ తర్వాత కొన్ని గంటలకు పెట్రోల్ పోసి తగలపెట్టారని పోలీసులు చెబుతూ వస్తున్నారు. అయితే.... ఆమెను బతికుండగానే కాల్చి వేసినట్లు ప్రధాన నిందితుడు ఆరిఫ్... జైల్లో పేర్కోనడం గమనార్హం.

AlsoRead కుళ్లు సమాజం... పోర్న్ సైట్స్ లో ‘దిశ’ రేప్ వీడియో కోసం......

జైల్లో నిందితుల కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా...  వారిలో కొంత మంది జవాన్లు నిందితులతో మాటకలిపారు. ఆ సమయంలో ఆరిఫ్... దిశ పట్ల వారు ఎంత కిరాతకంగా ప్రవర్తించారో వివరించారు.

స్కూటీ కోసం ఎదురుచూస్తున్న దిశను.. బాగు చేయించాం తీసుకెళుదూ రమ్మని పిలిచారు. అనంతరం ఆరిఫ్ సహా ముగ్గురు నిందితులు దిశను బలవంతంగా చేతులు, కాళ్లు పట్టుకొని సమీప ప్రాంతానికి లాక్కొని వెళ్తుంటే రక్షించండంటూ ఆమె పెద్దగా కేకలు పెట్టింది.

ఎవరికైనా వినపడితే.. తమ గుట్టు బయటపడుతుందనే భయంతో చెన్నకేశవులు వెంటనే తన జేబులోని మద్యం సీసా తీసి... అందులోని మందుని బలవంతంగా ఆమె నోట్లో పోశాడు. అప్పటికే భయంతో, ఆందోళనతో ఉన్న ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే నలుగురు నిందితులు అత్యాచారానికి  ఒడిగట్టారు.

తరువాత ఆమెను లారీ మీదకు ఎక్కించారు. అక్కడా మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించిన ప్రతిసారి నోట్లో మద్యం పోయడం... ఆ తర్వాత ఆమెపై ఘాతుకానికి పాల్పడటం గమనార్హం. వీళ్ల పాశవిక దాడికి ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయింది. దీంతో... చనిపోయిందని భావించి.. చటాన్ పల్లి వంతెన వద్దకు తీసుకువెళ్లి.. బతికుండగానే పెట్రోల్ పోసి తగలపెట్టారు.