కోహిమా:  సీఎం కార్యాలయంలో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా సిబ్బందికి కరోనా సోకడంతో సీఎం నీఫియురియో హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. సీఎం కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా సోకిందని తేలడంతో సీఎంఓను శానిటైజ్ చేశారు.  అంతేకాదు సీఎంఓను 48 గంటల పాటు మూసివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

also read:అమానవీయం: స్మశానంలోనే ముగ్గురు కరోనా రోగుల హోం ఐసోలేషన్

ముందు జాగ్రత్తగానే సీఎం నీఫియురియో ఇంటి నుండే విధులు నిర్వహించనున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రితో పాటు కార్యాలయంలోని పనిచేసే 53  సిబ్బందికి పరీక్షలునిర్వహించారు. వీరిలో నలుగురికి కరోనా ఉన్నట్టుగా తేలింది.  రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1566కి చేరుకొన్నాయి. ఇప్పటికే 625 మంది కరోనా నుండి కోలుకొన్నారు. 

రాష్ట్రంలో కరోనా నుండి కోలుకొన్న రోగుల శాతం 39.9 శాతంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంగ్న్యు తెలిపారు. డింపూర్ లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఇప్పటివరకు 608 మంది కరోనా బారిన పడినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

తమ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది లేదా మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో గతంలోనే కర్ణాటక సీఎం యడియూరప్ప, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ లు హోం క్వారంటైన్ లో ఉన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా సోకింది. భోపాల్ లోని ఓ ఆసుపత్రిలో చౌహాన్ చికిత్స పొందుతున్నాడు.