ఓ టీవీ నటుడు.. బాలికపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబయి నగరంలో ఓ బాలికపై అత్యాచారం జరిపాడనే ఆరోపణలు రావడంతో.. టీవీ నటుడు, నాగిని 3 సీరియల్ నటుడు పెర్ల్ వి పూరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నగరంలో నడిచే కారులో ఓ బాలికపై అత్యాచారం చేశాడని పోలీసులకు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. 

నిందితుడు తనపై పలుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో మాల్వానీ పోలీసులు పూరీతోసహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. బాధిత బాలికతో పాటు ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీవీ నటుడు పూరీని అరెస్టు చేశారు. 

పెర్ల్ వి పూరి బ్రహ్మరాక్షస్ 2లో నటించారు. పూరీ దిల్ కి నాజర్ సే ఖూబ్ సూరత్ తో నటనారంగ ప్రవేశం చేశారు. ఫిర్ భీనా మనే, బాద్  తామీజ్ దిల్, నాగిని 3 వంటి సీరియల్స్ లో నటించారు.