కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20607) రైలుపై కర్ణాటకలో దాడి జరిగింది. 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20607) రైలుపై కర్ణాటకలో దాడి జరిగింది. కృష్ణరాజపురం, బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌ల మధ్య శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళులు రువ్వారు. ఈ ఘటనలో రైలు.. రెండు కిటికీలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. 

నైరుతి రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ సంఘటన ఉదయం 10.30 గంటల సమయంలో జరిగింది. రైలులోని C4, C5 కోచ్‌లలో ఒక్కో కిటికీ దెబ్బతిన్నాయి. ఎవరికీ గాయాలు కాకపోవడం.. అద్దాలు పూర్తిగా పగలకపోవడంతో రైలు రాకపోకలు ఆగలేదు. అయితే డబుల్ గ్లాస్ కిటికీలు, మధ్యలో ఉన్న వాక్యూమ్ కారణంగా ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాలేదు.

‘‘పదేపదే అవగాహన డ్రైవ్‌లు మరియు కఠినమైన హెచ్చరికలు ఉన్నప్పటికీ.. కొందరు దుర్మార్గులు ప్రజా ఆస్తులైన రైళ్లను పాడు చేస్తూనే ఉన్నారు. కదులుతున్న రైళ్లతో సహా పబ్లిక్ ఆస్తులను పాడు చేయడం రైల్వే చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నాన్ బెయిలబుల్ నేరం. తాజా ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు’’ అని ఒక అధికారి తెలిపారు. 

ఇక, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్లు రువ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో బంగారుపేట-కృష్ణరాజపురం స్టేషన్ల మధ్య ఇదే రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఇక, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై కూడా రాళ్లు రువ్వారు.