మైసూరు: విద్యార్థులకు బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్ధి వక్రించి నీచమైన కార్యానికి పాల్పడ్డాడు. తన వద్ద చదువుకున్న ఓ విద్యార్థినితో కామక్రీడలో తేలియాడుతూ దాన్ని మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. మొబైల్ లో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసురూ జిల్లా నంజనగూడు తాలుకాలోని రాంపుర గ్రామంలో చోటు చేసుకుంది. 

రాంపుర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సిద్ధరాజు అలియాస్ సిద్ధరామయ్యకు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తన వద్ద చదువుకున్న 20 ఏల్ల విద్యార్థిని మభ్యపెడుతూ అతను కామవాంఛలు తీర్చుకుంటూ వస్తున్నాడు. 

వాటిని మొబైల్ చిత్రించి అమ్మాయికి పంపించాడు. అవి కాస్తా వేరే నెంబర్ కు వెళ్లాయి. దాంతో సోమవారం ఆ ఫొటోలు గ్రామంలో వైరల్ అయ్యాయి.  58 ఏళ్ల సిద్ధరాడు 25 ఏళ్లుగా అదే గ్రామంలో పని చేస్తూ వస్తున్నాడు. విద్యార్థినులతో అతను అసభ్యంగా ప్రవర్తించేవాడు. అలా ఓ విద్యార్థినిని లోబరుచుకున్నాడు. ఆమె పాఠశాల విడిచి వెళ్లిన తర్వాత కూడా వదలలేదు. ఆమెతో కామవాంఛ తీర్చుకుంటూ వస్తున్నాడు.

ఫొటోలు చూసిన గ్రామస్థులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. దీంతో అతను అక్కడి నుంచి గుట్టు తెలియకుండా పరారయ్యాడు. అతన్ని అరెస్టు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.