తన ఫోన్ ని ట్యాప్ చేశారని తనకు అనుమానంగా ఉందని మాండ్య ఎంపీ సుమలత ఆరోపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆదివారం సుమలత తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి అప్పగించాల్సిందేనని అన్నారు. సీబీఐకి అప్పగిస్తే తప్పు ఎవరు చేశారన్న విషయం బయటకు వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా కర్ణాటకలో సుమారు 300 మంది ఫోన్లు చేసి ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై ఆరోపణలు రావడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

త్వరలోనే ఎవరు ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో బయటకు వస్తుందని ఆమె అన్నారు. నిజాలు బటయకు వస్తాయని తనకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మాండ్య ఎంపీ గా గెలుపొందారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన మాసీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పరాజయం పాలయ్యారు.