Asianet News TeluguAsianet News Telugu

కేంద్రాన్ని విమర్శించకుంటే.. నేనే ఉపరాష్ట్రపతిని అయ్యేవాడిని.. : మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్

కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుంటే తనను ఉపరాష్ట్రపతి చేసేవారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. అప్పటికే తనకు ప్రజలు తెలిపారని, ఉపరాష్ట్రపతి బరిలో నా పేరు ఉన్నదని తెలిపారని పేర్కొన్నారు. కానీ, తాను గళం ఎత్తకుండా ఉండలేనని మాట్లాడారు.
 

my name was in rounds while selecting vice president says meghalaya governor satyapal malik
Author
First Published Sep 11, 2022, 6:19 AM IST

న్యూఢిల్లీ: మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి తొలగిస్తున్న కాలంలో ఆయనే గవర్న‌ర్‌గా ఉన్నారు. అప్పటి నుంచి సత్యపాల్ మాలిక్ ఎక్కువగా ప్రజల దృష్టిలోకి చేరారు. అయితే, క్రమంగా ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయన మేఘాలయకు బదిలీ అయినా తన విమర్శల పరంపరను ఆపలేరు. తాజాగా, ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను గళం ఎత్తకపోయి ఉంటే తానే ఉపరాష్ట్రపతి అయ్యేవాడినని సత్యపాల్ మాలిక్ అన్నారు. ఈ సూచనలు తనకు అది వరకే వచ్చాయని వివరించారు. కానీ, తాను ఆ పదవి కోసం మాట్లాడకుడా ఉండలేకపోయానని తెలిపారు. తనకు తోచిన అంశంపై మాట్లాడకుండా ఉండాలని తాను భావించరని వివరించారు. తనకు నచ్చిన విషయంపై మాట్లాడకుండా ఉండలేనని చెప్పారు.

అదే సమయంలో ఆయన రాహుల్ గాంధీపై ప్రశంసలు చేశారు. భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ సరైన పని చేస్తున్నారని వివరించారు. రాహుల్ గాంధీ తన పార్టీ కోసం మంచి పని చేస్తున్నాడని పేర్కొన్నారు.

ఈ యాత్ర ఏం సందేశం ఇస్తున్నదని ప్రశ్నించగా.. అది తనకు తెలియదని, అది ప్రజలు చెప్పాలని వివరించారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం మంచి పని చేస్తున్నట్టు తెలిపారు. ఈడీ రైడ్లు ఎక్కువగా ప్రతిపక్షాల పైనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిజానిక బీజేపీ నేతలపైనా ఈ దాడులు జరగాలని వివరించారు. ఎందుకంటే.. ఈడీ రైడ్లు జరపాల్సిన స్థితిలో బీజేపీ నేతలు ఉన్నారని వివరించారు. 

రైతుల కోసం తన గళాన్ని ఎత్తుతూనే ఉంటానని సత్యపాల్ మాలిక్ అన్నారు. ప్రస్తుత రీతిలో ఆందోళన కొనసాగితే కనీస మద్దతు ధరను కేంద్రం అమలు చేసేలా లేదని, తానే స్వయంగా రైతులతోపాట ఆందోళనలు చేపడుతానని వార్నిండ్ ఇచ్చారు. కగా, రైతులు ఆదాయాల కంటే కూడా చాలా రెట్ల వేగంగా అదానీ ఆస్తులు పెరుగుతున్నాయని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios