Asianet News TeluguAsianet News Telugu

UP Assembly Elections: యూపీ బీజేపీలో కలకలం.. ఆ రోజే నా నిర్ణ‌యం వెల్ల‌డిస్తా.. స్వామి ప్రసాద్‌ మౌర్య

 UP Assembly Elections: ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీకి రాజీనామా చేయ‌గా తాజాగా యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.  అయితే.. తన ప‌దవికి రాజీనామా చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను, త‌న‌ తదుపరి చర్యను శుక్రవారం ( జ‌న‌వ‌రి 14) వెల్లడిస్తానని తెలిపారు. తాను ఇంకా బీజేపీని   విడిచిపెట్టలేదనీ, వేరే పార్టీ లో చేర‌లేద‌ని కీల‌క ప్రక‌ట‌న చేశారు
 

My Exit Has Caused Earthquake In BJP SP Maurya On Quitting UP Cabinet
Author
Hyderabad, First Published Jan 12, 2022, 3:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

UP Assembly Elections: ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీకి రాజీనామా చేయ‌గా తాజాగా యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఆయ‌న ఇంత‌వ‌ర‌కూ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఆయ‌న‌తో పాటు  మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా అఖిలేష్ పార్టీ చేరడానికి సిద్దంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఈ స్వామి ప్రసాద్‌ రాజీనామా వార్త యూపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.

ఈ క్ర‌మంలో స్వామి ప్రసాద్‌ మౌర్య మీడియాతో మాట్లాడుతూ.. తన ప‌దవికి రాజీనామా చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను, త‌న‌ తదుపరి చర్యను శుక్రవారం ( జ‌న‌వ‌రి 14) వెల్లడిస్తానని తెలిపారు. తాను ఇంకా బీజేపీని   విడిచిపెట్టలేదనీ, వేరే పార్టీ లో చేర‌లేద‌ని కీల‌క ప్రక‌ట‌న చేశారు. త‌న చ‌ర్య బీజేపీలో భూకంపం కలిగించిందని చెప్పుకోచ్చారు. తనతో పాటు మరికొంత మంది మంత్రులు,  ఎమ్మెల్యేలు పార్టీని వీడతారని పేర్కొన్నారు. 

జనవరి 14 న సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. ఎవరితో కలిసి రావాలన్నా స్వాగతిస్తామని అన్నారు.మంగళవారం స్వామి ప్రసాద్ మౌర్య యోగి మంత్రివర్గానికి రాజీనామా చేసి బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం సంచలనం రేపింది.
ఇప్పుడు అందరికీ స్వామి ప్రసాద్‌ అంటే ఎవరో తెలిసి వస్తుందని అన్నారు. తాను ఎక్కడ ఉంటే ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా చెప్పారు. ఇప్ప‌టికే రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్,  వినయ్ శాక్యా బీజేపీకి షాక్ ఇచ్చారు. 

 
తానే బీజేపీని తిరస్కరించన‌ని, ఆ విష‌యంలో వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని అన్నారు. తాను రాజీనామా చేసిన వెంట‌నే.. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ త‌న‌ని అభినందించారని తెలిపారు. నేడు. రేపు ప్ర‌జ‌ల‌తో చర్చిస్తానని,  తదుపరి త‌న రాజకీయ ఎత్తుగడను 14న (శుక్రవారం) వెల్లడిస్తానని తెలిపారు. త‌న నిర్ణయం, త‌న‌తో పాటు ఎవరెవ‌రు వ‌స్తారో  విష‌యాన్ని కూడా చెబుతానని అన్నారు.

స్వామి ప్రసాద్ నిర్ణ‌యంతో యూపీ బీజేపీ కంగుతిన్న‌ది. బీసీ సామాజిక వ‌ర్గంపై మంచి ప‌ట్టున్న నేత ఆయ‌న‌. అధిష్టాన నిర్ణ‌యం మేర‌కు ఆయ‌న బుజ్జగించే ప్రయత్నాలు మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. స్వామి ప్రసాద్‌ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని ట్విట్టర్‌ వేదికగా కోరారు. తొందర పాటు నిర్ణయాలు ఎప్పుడూ తప్పు అవుతాయని, ఒక్కసారి అందరం కలిసి కూర్చొని చర్చిద్దామని కోరారు.  
 
మౌర్య .. బీజేపీలో కీల‌క నేత.. వెనుకబడిన వర్గాల (ఓబీసీ) నాయకుడు. మౌర్యకు కుషావా వర్గాల్లో అపారమైన పట్టు ఉంది. ఆయ‌న‌ అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ఇతర వెనుకబడిన వర్గాల వారిని ఆకర్షించడానికి,  సమాజ్‌వాదీ పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసేవారు. దాదాపు 40 శాతం ఓబీసీ ఓట‌ర్లు ఉన్న యూపీలో మౌర్య నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న 2016లో మాయావతికి బీఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పార్టీలో టిక్కెట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తూ ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. 

ఆ తర్వాత సొంతంగా లోక్‌తాంత్రిక్‌ బహుజన్‌ మంచ్‌ అనే సంస్థని స్థాపించి.. ప్ర‌జ స‌మ‌స్య‌లపై పోరాటం సాగించారు. అలా.. ప్రజల్లోనే ఉంటూ.. వారిపై పట్టు సాధించారు. 2017లో ఆయ‌న‌ బీజేపీలో చేరి పడ్రౌనా  నుంచి శాసనసభకి ఎన్నికై కార్మిక మంత్రి అయ్యారు. 

మౌర్య కుమార్తె సంఘమిత్ర బీజేపీలోనే ఎంపీగా ఉన్నారు. ఆమె బదౌన్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మౌర్య బీజేపీని వీడ‌టంతో 20 నియోజకవర్గాల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చనీ, అలాగే ఖుషీనగర్, ప్రతాప్‌గఢ్, కాన్సూర్‌ దెహత్, బండా, షాహజాన్‌పూర్‌ జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి.  
 
ఈ విష‌యంలో దాదాపు మూడునెల‌ల నుంచే..ముస‌లం న‌డుస్తోన్న‌ట్టు తెలుస్తోంది. యోగి ఆదిత్యనాథ్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసేందుకు మౌర్య రెండు నెలల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. కానీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఢిల్లీ నుంచి యూపీకి పంపిన ముగ్గురు సభ్యుల బృందం శ్రేణుల్లో ఆగ్రహావేశాలను తీర్చలేకపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios