New Delhi: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఐక్యతే తన లక్ష్యమని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాను వివిధ పార్టీలకు చెందిన నాయకులను కలవడం గురించి బీజేపీ నేతల ప్రశ్నలు, విమర్శలను తాను పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు.
Bihar Chief Minister Nitish Kumar: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు కదులున్నాయి. దీని కోసం పలువురు నాయకులు ముందుండి చొరవ తీసుకుంటున్నారు. వారిలో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఒకరు. ఇదివరకు పలువురు ప్రతిపక్ష నాయకులను కలిసి రానున్న లోక్ సభ ఎన్నికల గురించి ప్రతిపక్షాల ఐక్య పోరాటం గురించి చర్చించారు. ఇదే క్రమంలో ఆయన మరోసారి దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ సహా పలు పార్టీల సీనియర్ నేతలను కలిశారు. వారిలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు కూడా ఉన్నారు. తన పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఐక్యతే తన లక్ష్యమని నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాను వివిధ పార్టీలకు చెందిన నాయకులను కలవడం గురించి బీజేపీ నేతల ప్రశ్నలు, విమర్శలను తాను పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు తన లక్ష్యం ఒక్కటేననీ, అది ప్రతిపక్షాల ఐత్యత, దీని కోసమే ఢిల్లీ పర్యటనకు వచ్చినట్టు తెలిపారు. పలువురు నేతలను కలిసి ఇదే విషయం గురించి చర్చించినట్టు తెలిపారు.
“ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడం నా ఏకైక లక్ష్యం.. నేను దాని కోసం కృషి చేస్తున్నాను. చింతించకండి, మీరు నెమ్మదిగా సమాచారాన్ని అందుకుంటారు. కొంతసేపు ఆగండి.. అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తా'' అని పాట్నా విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. “మీకు తెలుసు, నేను మూడు రోజుల పాటు ఢిల్లీ వెళ్లి ప్రతిపక్ష పార్టీల నేతలను కలిశాను. మేము కలిసి కూర్చుని వారితో చర్చించాము. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే ఏకైక లక్ష్యం అని, అందుకు ప్రతి నాయకుడు కృషి చేస్తానన్నారు. దానికి సంబంధించిన స్టేట్‌మెంట్లు ఇచ్చారు’’ అని అన్నారు.
భవిష్యత్తు వ్యూహం గురించి అడిగిన ప్రశ్నకు నితీష్ కుమార్ మాట్లాడుతూ.. "చింతించకండి. మీరు దానిని నెమ్మదిగా అన్ని విషయాలు తెలుసుకుంటారు. తన పర్యటనపై బీజేపీ నేతలు చేసే ఆరోపణలు, ప్రశ్నలను పట్టించుకోవడం లేదు" అని తెలిపారు. “వారు చాలా విషయాలు చెప్పేవారు. నేను వాటిని గమనించను. నేను మిమ్మల్ని (మీడియా వ్యక్తులను) చూసినప్పుడు, నేను చాలా గౌరవిస్తాను కాబట్టి నేను మీ వద్దకు వచ్చాను' అని నితీష్ కుమార్ అన్నారు.
