రాజ్యసభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఎంవీఏ ప్రభుత్వం కీలక రెండు ఓట్లను కోల్పొనుంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎన్సీపీకి చెందిన నేతలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ ల బెయిల్ ను కోర్టు తిరస్కరించింది. ఖైదీలకు ఓటు హక్కు లేదని ఈడీ కోర్టులో వాదించగా.. దానికి కోర్టు ఏకీభవించింది. 

మహారాష్ట్ర సంకీర్ణ ప్ర‌భుత్వం ఎంవీఏకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రేపు జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో కీలకమైన రెండు ఓట్ల‌ను ఆ కూట‌మి అభ్య‌ర్థులు కోల్పొనున్నారు. ఎంవీఏలో కూట‌మిలో ఉన్న పార్టీల‌కు చెందిన నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ నేతలు కొంత కాలం కింద‌ట అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఇద్ద‌రు నేత‌లు ఎన్నిక‌ల నేప‌థ్యంలో బెయిల్ కోసం అప్పీల్ చేసుకోగా.. కోర్టు దానిని తిర‌స్క‌రించింది. 

రాజ్య‌స‌భ్య ఎన్నిక‌ల‌కు ఒక రోజు ముందు ఇది జ‌ర‌గ‌డం ఎంవీఏ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌తీ ఓటు ముఖ్య‌మైన‌దే. ప్ర‌తీ ఓటుకు ప్ర‌ధాన్య‌త ఉంది. ఈ రెండు ఓట్లు కూడా గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది. కాగా మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఫిబ్రవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అప్ప‌టి నుంచి ఆయ‌న జైలులోనే ఉన్నారు. రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కూడా ఇలాంటి ఆరోపణలతో జైలులో ఉంటున్నారు. 

Sanjay Raut: అల్-ఖైదా హెచ్చ‌రిక‌లు.. ఏం జరిగినా బీజేపీదే బాధ్యత : సంజయ్‌ రౌత్‌

అయితే వీరిద్ద‌రూ శుక్రవారం జ‌రిగే రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేయడానికి నేడు బెయిల్ కోసం అభ్య‌ర్థించారు. కానీ కోర్టు దానికి స‌మ్మ‌తించ‌లేదు. ఖైదీలకు ఓటు హక్కు లేదు అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదించగా.. దానికి కోర్టు ఏకీభ‌వించింది. అరెస్టు అయిన ఇద్ద‌రూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కి చెందారు. ఇది సంకీర్ణ ప్ర‌భుత్వంలో భాగంగా ఉంది. ఈ ఎంవీఏ ప్ర‌భుత్వానికి శివ‌సేన పార్టీ నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. అందులో కాంగ్రెస్ ఎన్సీపీ భాగస్వామ్యంగా ఉన్నాయి. 

కాగా మ‌హారాష్ట్ర మాజీ సీఎం, ప్ర‌తిప‌క్ష సీఎం కూడా ఈ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌లేర‌ని ముందుగా భావించినా.. ఆయ‌నకు కోవిడ్ నెగిటివ్ రావ‌డంతో బీజేపీ ల‌బ్ది పొంద‌నుంది. ఆయ‌న రేపు ఓటు వేసే అవ‌కాశం ఉంది. మొత్తంగా మహారాష్ట్రలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏడుగురు అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. అయితే దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత తొలిసారిగా రాష్ట్రంలో పోటీ నెల‌కొంది. 

శివ‌సేన నుంచి ప్ర‌స్తుత రాజ్య‌స‌భ్య స‌భ్యుడు, ఆ పార్టీ సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్, సంజ‌య్ ప‌వార్ అనే అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో కేంద్ర ఆరోగ్య మంత్రి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ ఉన్నారు. అధికార సంకీర్ణ మిత్రపక్షాలు అయిన ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఒక్కో అభ్యర్థి నిలబెట్టాయి. ఇందులో ప్రఫుల్ పటేల్, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ లు అనే నేతలు ఉన్నారు. 

జూలై 18న పోలింగ్: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల

మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నిక‌ల్లో ఒక సీటు గెల‌వాలంటే ఏ అభ్యర్థికైనా 42 ఓట్లు కావాలి. శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి 288 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయన్నారు. ఈ నేప‌థ్యంలో ఆరు రాజ్యసభ స్థానాల్లో మూడింటిని గెలుచుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. అలాగే బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పార్టీ ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌ను సునాయాసంగా గెలుపించుకోగ‌ల‌దు. కానీ మూడో అభ్య‌ర్థి కూడా బ‌రిలో ఉన్నారు. అయితే చిన్న పార్టీలు, స్వ‌తంత్రులు క‌లిపి మొత్తం 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కూడా ఈ ఎన్నిక‌ల్లో కీల‌క‌పాత్ర పోషించ‌నున్నారు. కాగా బీజేపీ త‌మ‌కు 22 అదనపు ఓట్లు ఉన్నాయని అలాగే ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొంది. కాగా ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించాయి.