దారుణం: 40 మంది అత్యాచార బాధితుల బట్టలిప్పి ఇలా....

Muzaffarpur shelter home rape case: Victims forced to sleep naked alongside teacher
Highlights

:అత్యాచారాలకు గురైన బాధితులను బలవంతంగా బట్టలిప్పి నిద్రించేలా చేస్తున్న ఓ టీచర్ దారుణం వెలుగు చూసింది.  తాను చెప్పినట్టు వినకపోతే  అత్యాచార బాధితులను ఆ టీచర్ తీవ్ర చిత్రహింసలకు గురి చేసింది.


పాట్నా:అత్యాచారాలకు గురైన బాధితులను బలవంతంగా బట్టలిప్పి నిద్రించేలా చేస్తున్న ఓ టీచర్ దారుణం వెలుగు చూసింది.  తాను చెప్పినట్టు వినకపోతే  అత్యాచార బాధితులను ఆ టీచర్ తీవ్ర చిత్రహింసలకు గురి చేసింది.  అంతేకాదు టీచర్ కొట్టిన దెబ్బలకు ఓ బాధితురాలు మృతి చెందిందనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న పోలీసులకు మహిళా సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న దారుణాలు వెలుగు చూశాయి.

బీహార్‌ రాష్ట్రంలో ముజఫర్‌పూర్‌లోని మహిళా సంరక్షణా కేంద్రంలో  అత్యాచారాలకు గురైన 40 మంది మైనర్ బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. అయితే  బాధితులను  రాత్రిపూట బట్టలిప్పించి  నగ్నంగా పడుకోవాలని  మహిళా సంరక్షణ కేంద్రంలో  టీచర్‌‌గా పనిచేస్తున్న కిరణ్ వేధింపులకు గురిచేస్తోంది.

మహిళా సంరక్షణాలయంలో అత్యాచార బాధిత మహిళలను  వేధింపులకు గురిచేస్తోందనే విషయం బయటకు పొక్కింది. అంతేకాదు సంరక్షణాలయానికి చెందిన ఉన్నతాధికారులకు సహకరించలేదనే అక్కసుతో బాధిత మహిళలను వివస్త్రలుగా  చేసి  వేధింపులకు గురిచేస్తోందన్నారు.

 టీచర్‌కు సహకరించలేదనే కారణంగా  ఓ బాధితురాలిని కొట్టి చంపినట్టు కిరణ్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ విషయమై  విచారణకు వెళ్లిన పోలీసులకు  మహిళా సంరక్షణాలయంలో బాధితులతో కిరణ్ వ్యవహరిస్తున్న తీరు  బయటి ప్రపంచానికి తెలిసింది.

 దాదాపు నెల రోజుల క్రితం ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు హోమ్ స్టాఫ్ మెంబర్స్, ప్రభుత్వ ఉద్యోగులు సహా మొత్తం 10 మందిని  అరెస్ట్ చేశారు. 

 బాధితులను వేరే జిల్లా షెల్టర్ లకు తరలించారు. అమ్మాయిలను రక్షించడంలో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విపక్ష నేత తేజస్వీ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. గత మార్చి నుంచి ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ లోని 40 మంది మైనర్ బాలికలను రాజకీయ నాయకులు, అధికారులు వాడుకున్నారని, కొందరికి బలవంతంగా అబార్షన్లు చేయించారని, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆర్జేడీ ఒక ప్రకటనలో ఆరోపించింది.

loader