Bihar: బీహార్‌లోని బెట్టియాలో 5వ తరగతి విద్యార్థిపై క్రూరత్వం ప్రవర్తించాడు. విద్యార్థిని దారుణంగా, విచక్షణరహితంగా చావుదెబ్బలు కొట్టాడు. విద్యార్థి పరిస్థితి చూసి కోపోద్రిక్తులైన కుటుంబీకులు, గ్రామస్థులు పాఠశాలలో బీభత్సం సృష్టించారు. అనంతరం నిందితుడైన ఉపాధ్యాయుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ అనంతరం విడిచిపెట్టారు.
Bihar: విద్యార్థిపై ఉపాధ్యాయుడు క్రూరత్వం ప్రవర్తించాడు. విద్యార్థిని దారుణంగా చావుదెబ్బలు కొట్టాడు. ఉపాధ్యాయుడి దెబ్బలకు చూస్తుంటే.. ఒళ్లు జలదరిస్తుంది. ఉపాధ్యాయుడి దెబ్బలకు బాలుడి చర్మం కమిలి.. వాచిపోయింది. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన బేతియా జిల్లాలోని చంపాటియా బ్లాక్‌లో జరిగింది.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. చంపాటియా బ్లాక్‌లోని లాల్‌గర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లాల్‌గఢ్ వార్డు నంబర్ 5లో నివాసం ఉంటున్న శివ్‌జీ పాశ్వాన్ కుమారుడు అజిత్ కుమార్ (9). ఆ విద్యార్థి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తగరతి చదువుతున్నారు. శనివారం మధ్యాహ్నం అజిత్ స్కూల్లో తన స్నేహితుడితో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఓ విద్యార్థి టాయిలెట్లో దాక్కున్నాడు. దీంతో సరదాగా టాయిలెట్ తలుపును అజిత్ మూసేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు.. అజిత్ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. బెల్ట్ తో విద్యార్థిని చావుదెబ్బలు కొట్టాడు. ఉపాధ్యాయుడి దెబ్బలకు బాలుడి చర్మం కమిలిపోయింది. విద్యార్థిని శరీరం పై నుంచి కింద వరకు బెల్టు గుర్తులు కనిపిస్తున్నాయి. విద్యార్థి పరిస్థితి చూసిన తల్లిదండ్రులు వెంటనే చికిత్స నిమిత్తం బెట్టియా GMCHలో చేర్పించారు.
అదే సమయంలో విద్యార్థి పరిస్థితి చూసి కోపోద్రిక్తులైన గ్రామస్తులు పాఠశాలలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో ప్రజలు ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం ఉపాధ్యాయుడిని విడుదల చేశారు. కుటుంబీకులు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
