Asianet News TeluguAsianet News Telugu

పీఎఫ్ఐ పట్ల ముస్లిం విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి - ముస్లిం రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ మౌలానా సుహైబ్

పీఎఫ్ఐ విషయంలో ముస్లిం విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ మౌలానా సుహైబ్ ఖాస్మి అన్నారు. ఈ సంస్థ యువతను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. 

Muslim students should be wary of PFI - Muslim Rashtriya Manch national convener Maulana Suhaib
Author
First Published Dec 31, 2022, 3:05 PM IST

కేరళ కేంద్రంగా పని చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో ముస్లిం రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ మౌలానా సుహైబ్ ఖాస్మి కీలక వ్యాఖ్యలు చేశారు. పీఎఫ్ఐ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విద్యావంతులైన ముస్లింలను టార్గెట్ గా చేసుకుందని అన్నారు. ఈ సంస్థ పాఠశాలలు, మదర్సాలలో ఉన్న యువతను తప్పుదోవ పట్టించాలనుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు పీఎఫ్ఐ తన పని చేసుకుపోవడానికి కొత్త, విభిన్న పేర్లను వాడుకుంటోందని తెలిపారు. 

బంగ్లాదేశ్ బార్డర్‌లో బీఎస్ఎఫ్ శునకం ప్రసవం.. దర్యాప్తునకు ఆదేశాలు

భారతదేశం శాంతియుతమైన దేశమని, ముస్లింలు ఇక్కడ చాలా ఏళ్లుగా ఉంటున్నారని మౌలానా సుహైబ్ ఖాస్మి అన్నారు. విద్యార్థులు పీఎఫ్ఐ వంటి సంస్థల గురించి తెలుసుకోవాలని ఆయన సూచించారు. దీని పట్ల ముస్లిం విద్యార్థులందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ‘‘ పీఎఫ్ఐ పాఠశాలలు, మదర్సాల్లో యువతను తప్పుదోవ పట్టించాలని చూస్తోంది. కానీ ప్రభుత్వం దాని ఉద్దేశాలను నాశనం చేసింది. ఆ సంస్థ ఇప్పటికీ తన పని తాను చేసుకుపోవడానికి ఆధునిక పేర్లను ఉపయోగిస్తోంది ’’ అని ఆయన అన్నారు.

ముస్లిం రాష్ట్రీయ మంచ్ అనేది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన ఒక శాఖ. భారతదేశంలోని ముస్లిం సమాజాలను హిందువులకు దగ్గరగా తీసుకురావాలని, ముస్లిం సమాజంతో కమ్యూనికేషన్ ను పెంపొందించే ఉద్దేశంతో 2002లో దీనిని స్థాపించారు. 

బంగ్లాదేశ్ బార్డర్‌లో బీఎస్ఎఫ్ శునకం ప్రసవం.. దర్యాప్తునకు ఆదేశాలు

కాగా.. కేంద్రం ఇటీవల ఐదేళ్లపాటు పీఎఫ్‌ఐ సంస్థపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ సంస్థపై ఎన్ఐఏ చర్యలు కొనసాగిస్తోంది. సెప్టెంబరులో ఎన్ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర ఏజెన్సీలు అలాగే పోలీసు బలగాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక దాడులలో 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు.

గురువారం కూడా కేరళలో పీఎఫ్ఐకు సంబంధించిన 58 స్థలాలపై ఎన్ఐఏ దాడి చేసింది. అనేక ముఖ్యమైన నేరారోపణ పత్రాలు, మెటీరియల్‌తో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. కొంత మంది పీఎఫ్ఐ నాయకులు పీఎఫ్ఐ పేరు మార్చి సంస్థను తిరిగి స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ సమాచారం అందడంతోనే దాడులు నిర్వహించామని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. అలాగే చట్టవ్యతిరేక, హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన కేసులో అదే రోజు ఓ న్యాయవాదిని అరెస్టు చేసింది. ఆయన పీఎఫ్ఐలో సబ్యుడిగా ఉన్నాడు.

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్: డ్రింక్ అండ్ డ్రైవింగ్ తనిఖీల కోసం 18,000 మంది ఢిల్లీ పోలీసులు

జాతీయ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ లోని స్పెషల్ కోర్టులో తాజాగా ఓ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీని ప్రకారం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యోగా శిక్షణా తరగతుల ముసుగులో ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నిర్వహించి, ఉగ్రవాద చర్యలకు వ్యక్తులను నియమించుకుంది. ఆ సంస్థకు చెందిన నాయకులు భారత ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు, వ్యక్తులపై కోపం, శత్రుత్వంతో నిండిన ప్రసంగాలను ఉపయోగించి ముస్లిం యువకులను తీవ్రవాదం వైపు నడిపించడానికి ప్రయత్నించారు. ఆయుధాలను ఎలా ఉపయోగించాలో కూడా నేర్పించాలరి తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios