Hyderabad: దేశంలో వ్యవస్థీకృత ముస్లిం విద్వేషం పెరుగుతోందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఇదే సమయంలో దాడులకు పాల్పడుతున్న గోరక్షకులను బీజేపీ రక్షిస్తోందని ఆయన ఆరోపించారు. భివానీ మరణాలపై స్పందిస్తూ గోరక్షకులను బీజేపీ కాపాడుతోందనీ, దీనిపై హర్యానా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైదరాబాద్ ఎంపీ ఆరోపించారు. 

AIMIM chief Asaduddin Owaisi: హర్యానా లోని భివానీలో ఇద్దరు ముస్లిం యువకులను భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడిచేసి హత్య చేయడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే, బీజేపీ సర్కారు తీరుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దాడులకు పాల్పడే గోరక్షకులను బీజేపీ కాపాడుతోందనీ, దీనిపై హర్యానా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైదరాబాద్ ఎంపీ ఆరోపించారు. జునైద్, నసీర్ మరణాలు అమానుషమననీ, ఆ యువకులను 'గోరక్షక్' ముఠా చంపిందని, వీరికి బీజేపీ, ఆరెస్సెస్ మద్దతు ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలను కించపరుస్తున్నారని అన్నారు. జునైద్, నసీర్ హత్యలనుజునైద్, నసీర్ మరణాలకు హిందూ రాజ్యాన్ని విశ్వసించే వారే కారణమని ఎంఐఎం నేత వ్యాఖ్యానించారు.

దేశంలో వ్యవస్థీకృత ముస్లిం విద్వేషం రాజ్యమేలుతోందన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటారా లేదా అని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని అడగాలనుకుంటున్నానని చెప్పారు. ఈ దాడిని ఖండిస్తున్నానని పేర్కొంటూ.. ఇది మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దౌర్జన్యం అని అన్నారు. జునైద్, నసీర్ మరణాలకు హిందూ రాజ్యాన్ని విశ్వసించే వారే కారణమని ఎంఐఎం నేత ఒవైసీ వ్యాఖ్యానించారు. దేశంలో వ్యవస్థీకృత ముస్లిం విద్వేషం రాజ్యమేలుతోందన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటారా లేదా? అని ప్రశ్నించారు. ముస్లింలను వేధించడమే బీజేపీ విధానమా? అని అడుగుతూ.. దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని అన్నారు. 

గోరక్షకుల ముసుగులో ప్రజలను చంపుతూ దోపిడీలకు పాల్పడుతున్న ఇలాంటి తీవ్రవాద శక్తులను బీజేపీ చురుగ్గా ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అలాంటి వారిని ప్రోత్సహించడం మానుకోవాలని హితవు పలికారు. కాగా, రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లా ఘట్ మీకా గ్రామానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35) బుధవారం అపహరణకు గురికాగా, వారి మృతదేహాలు గురువారం ఉదయం భివానీలోని లోహరు వద్ద కాలిపోయిన కారులో కనిపించాయి. రాజస్థాన్ లోని భరత్ పూర్ లోని తమ గ్రామం నుంచి బజరంగ్ దళ్ కు చెందిన గోరక్షకులు ఇద్దరిని అపహరించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లా ఘట్ మీకా గ్రామానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35)లను బుధవారం అపహరించగా, మరుసటి రోజు ఉదయం భివానీలోని లోహరు వద్ద కాలిపోయిన బొలెరోలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజస్థాన్ పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎంఐఎం చీఫ్ ప్రశ్నించారు. బీజేపీ, పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు వారిని కాపాడే వరకు జునైద్, నసీర్ లకు న్యాయం జరగదని పేర్కొంటూ.. వారిని కాపాడుతున్నందున హర్యానా ప్రభుత్వం ఏమీ చేయదనీ, బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదన్నారు. 

'ఈ క్రిమినల్ శక్తులన్నీ జైళ్లలో ఉండాలి. గోసంరక్షణ కోసం పోలీసులు ఏం చేస్తున్నారు? అధికారంలో ఉన్నవారు చర్యలు తీసుకోవాల్సింది కానీ తీసుకోవడం లేదు" అని మండిపడ్డారు. బీబీసీ డాక్యుమెంటరీలను బ్యాన్ చేయవచ్చు కానీ యూట్యూబ్ లో పెట్టే ఇలాంటి నేరాలకు సంబంధించిన వీడియోలను బ్యాన్ చేయలేమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.