అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం ఆలయ నిర్మాణం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ ముస్లిం మహిళ చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. బెనార‌స్‌కు చెందిన ఇక్రా ఖాన్ అనే ముస్లిం యువ‌తి. త‌న చేతిమీద 'శ్రీరామ్' అనే అక్ష‌రాల‌ను పచ్చ‌బొట్టు వేయించుకుంది. త‌న‌తో పాటే ఎంతోమంది ముస్లిం సోద‌రులు సైతం  శ్రీరాముని ఆలయ నిర్మాణం ప‌ట్ల  సంతోషంగా ఉన్నామ‌ని తెలిపింది.  
ల‌క్ష‌లాది హిందువులు క‌ల‌లు క‌న్న శ్రీరాముని ఆల‌యం నిర్మించాల‌న్న కోరిక త‌న‌కు కూడా ఉంద‌ని, ఈ క్ష‌ణం కోసం ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తున్నాన‌ని పేర్కొంది.  అయోధ్యలో శ్రీరాముని ఆల‌య నిర్మాణ ప‌నుల‌కు ముందే హిందూ- ముస్లిం ఐక్య‌త‌ను చాటిచెప్పేందుకే తాను ఈ టాటూ వేయించుకున్న‌ట్లు తెలిపింది.  అంతేకాకుండా తాను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిమానిని ఇక్రా ఖాన్ వెల్ల‌డించింది.

శ్రీరాముని టాటూ వేయ‌మ‌ని అడిగిన‌ప్ప‌డు ఆమె ముస్లిం యువ‌తి తెలిసి చాలా షాక్ అయ్య‌న‌ని టాటూ దుకాణ‌పు ఓన‌ర్ అశోక్ గోగియా తెలిపారు. వార‌ణాసిలోని సిగ్రా న‌గ‌రంలో ఉన్న టాటూ దుకాణాన్ని గ‌త కొన్నేళ్లుగా న‌డుపుతున్నాన‌ని, ఓ ముస్లిం యువ‌తి శ్రీరాముని టాటూ వేయించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.