Asianet News TeluguAsianet News Telugu

బాబ్రీమసీదు కూల్చివేత: వాంగ్మూలం ఇవ్వాలని అద్వానీ,జోషీలకు కోర్టు ఆదేశం

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహార్ జోషీలు, శివసేన నేత సతీష్ ప్రదాన్ లను ఈ నెలాఖరులో తమ వాంగ్మూలం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది

Murli Manohar Joshi, LK Advani to appear via video in Babri Masjid demolition case
Author
New Delhi, First Published Jul 21, 2020, 1:53 PM IST


న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహార్ జోషీలు, శివసేన నేత సతీష్ ప్రదాన్ లను ఈ నెలాఖరులో తమ వాంగ్మూలం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు విచారణను చేపట్టనుంది కోర్టు. ఈ కేసులో 32 మంది నిందితులుగా ఉన్నారు.

అయోధ్య కేసును విచారిస్తున్న సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్  ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 
ఈ కేసులో శివసేన నేత ప్రధాన్, మాజీ కేంద్ర మంత్రులు మురళీ మనోహార్ జోషీ, ఎల్ కే అద్వానీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 22, 23 , 24 తేదీల్లో వాంగ్మూలం ఇవ్వాలని కోరారు.

నిందితుల తరపున న్యాయవాదులకు ఆన్‌లైన్ లో వాదనలు వినేందుకు వీలుగా లింకులను అందుబాటులో ఉంచాలని కోర్టు ఆదేశించింది.ఆన్ లైన్ లో వాంగ్మూలం ఇచ్చేందుకు సీబీఐ కోర్టు ఈ ముగ్గురికి  లింకులతో పాటు తేదీలను కూడ ఇచ్చిందని న్యాయవాది కెకె మిశ్రా తెలిపారు.

ఒకవేళ కోర్టు నిర్ణయించిన తేదీల్లో ఈ ముగ్గురు హాజరుకాలేకపోతే కొత్త తేదీలను కోర్టు ఇవ్వనుంది. ఈ ఏడాది ఆగష్టు 31వ తేదీ లోపుగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios