Asianet News TeluguAsianet News Telugu

ముంబై తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు: బందోబస్తు పటిష్టం

ముంబై నగరంలోని ప్రఖ్యాత తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. సోమవారం నాడు అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు ఓ ఆగంతకుడు ఫోన చేసి హోటల్ ను బాంబులతో పేల్చివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు.

Mumbais Taj Hotel receives bomb threat call from Pakistan; caller claims to be LeT terrorist
Author
Mumbai, First Published Jun 30, 2020, 1:50 PM IST


న్యూఢిల్లీ: ముంబై నగరంలోని ప్రఖ్యాత తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. సోమవారం నాడు అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు ఓ ఆగంతకుడు ఫోన చేసి హోటల్ ను బాంబులతో పేల్చివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఈ బాంబు బెదిరింపులతో హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హోటల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పాకిస్తాన్ లోని కరాచీ నుండి ఈ ఫోన్ కాల్ వచ్చినట్టుగా ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు.  2008 నవంబర్ 26వ తేదీన తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 166 మంది మరణించగా 300 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ కు చెందిన లష్కరే ఏ తోయిబా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 

ఈ బాంబు బెదిరింపు కాల్ కారణంగా తాజ్ హోటల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం నాడు పాకిస్తాన్ లోని స్టాక్ ఎక్చేంజ్ పై టెర్రరిస్టులు దాడికి దిగారు.భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. అంతేకాదు ఓ పోలీస్ అధికారి, ఇద్దరు పౌరులు కూడ మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios