సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మృతుడి సోదరి పన్నిన హనీట్రాప్ ఉదంతం ముంబై నగరంలో సంచలనం రేపింది. 2020 జూన్ నెలలో ముంబై నగరంలోని మలాద్ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది.
మీరు సినిమాల్లో చూసే ఉంటారు.. తన వాళ్లను చంపిన వారిపై పగ తీర్చుకునేందుకు హీరో గానీ, హీరోయిన్ గానీ ప్లాన్ వేస్తారు. వాళ్ల కుటుంబానికి దగ్గరై ఆ తర్వాత తెలివిగా చంపేస్తారు. చాలా సినిమాల్లో చూసిన ఈ సీన్.. తాజాగా నిజ జీవితంలో చోటుచేసుకుంది.
తన సోదరుడిని చంపిన వ్యక్తిని ఎలాగైనా చంపాలని ఆమె భావించింది. అందుకోసం ఆ హంతకుడికి వలపు వల విసిరింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సినిమాను తలపించేలా ఉన్న ఈ క్రైమ్ కుట్రను ముంబయి పోలీసులు ముందుగానే బట్టబయలు చేయడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మృతుడి సోదరి పన్నిన హనీట్రాప్ ఉదంతం ముంబై నగరంలో సంచలనం రేపింది. 2020 జూన్ నెలలో ముంబై నగరంలోని మలాద్ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవలో నిందితుడు మహ్మద్ సాధిక్ 24 ఏళ్ల వయసుగల అల్తాఫ్ ను హత్య చేశాడు. హత్య చేశాక హంతకుడు సాధిక్ ఢిల్లీకి పారిపోయాడు. సోదరుడు అల్తాఫ్ హత్య సంఘటనతో షాక్ కు గురైన అతని సోదరి యాస్మీన్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అల్తాఫ్ స్నేహితులు ఫరూక్, ఒవైస్, మనీస్, జాకీర్ ఖాన్, సత్యంపాండే ల సహాయంతో హంతకుడు సాధిక్ ను చంపాలని యాస్మీన్ నిర్ణయించుకుంది.
అల్తాఫ్ హత్య జరిగిన నెల రోజుల తర్వాత యాస్మిన్ అల్తాఫ్ స్నేహితులను మాల్వాలో కలిసి హంతకుడు సాధిక్ ను చంపడానికి కుట్ర పన్నారు. వారు మొదట సాధిక్ ను ఢిల్లీ నుంచి ముంబైకు రప్పించేందుకు హనీట్రాప్ చేయాలని నిర్ణయించుకున్నారు.దీనికోసం యాస్మిన్ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరచి సాధిక్ తో ఛాటింగ్ చేయడం ప్రారంభించింది. దీంతో సాధిక్ ప్రేమలో పడ్డాడు. ఢిల్లీలో ఉన్న సాధిక్ యాస్మిన్ ను కలవడానికి ముంబై వచ్చాడు. యాస్మిన్ అతన్ని ఆరేలోని చోటా క్మీర్ ప్రాంతానికి పిలిచింది. సాధిక్ అక్కడకు చేరుకున్నపుడు యాస్మిన్ కు బదులుగా అల్తాఫ్ ఐదుగురు స్నేహితులు అంబులెన్సులో ఎదురు చూస్తూ ఉన్నారు.
సాధిక్ రాగానే ఈ ముఠా అతన్ని కిడ్నాప్ చేసి వసాయినైగావ్ లోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అతన్ని చంపి మృతదేహాన్ని పారవేయాలని నిర్ణయించారు. సాధిక్ ను బలవంతంగా అంబులెన్సులో ఎక్కించడం చూసిన స్థానికుడొకరు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమై అంబులెన్సును గుర్తించారు. అంతలో అంబులెన్సులో పెట్రోలు అయిపోవడంతో వారు మరో కారును అద్దెకు తీసుకున్నారు. కారులో వెస్ట్రన్ జాతీయ రహదారిపై వెళుతుండగా దహిసర్ చెక్ నాకా గుండా వెళుతుండగా పోలీసులు యాస్మిన్ తో సహా అందరినీ అరెస్టు చేసి సాధిక్ ను రక్షించారు. అయితే సాధిక్ ను మునుపటి అల్తాఫ్ హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 12, 2021, 9:09 AM IST